ఆస్పత్రి నుంచి హృతిక్ రోషన్ నేడు డిశ్చార్జి!

11 Jul, 2013 00:58 IST|Sakshi
ఆస్పత్రి నుంచి హృతిక్ రోషన్ నేడు డిశ్చార్జి!

బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ ను గురువారం ఉదయం హిందూజా ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేయనున్నట్టు వైద్యులు తెలిపారు. గత రెండు నెలలుగా సబ్ డ్యూరల్ హెమటోమా వ్యాధితో బాధపడుతున్న హృతిక్ కు జూలై 6 తేదిన బ్రెయిన్ సర్జరీ చేసిన సంగతి తెలిసింది.

బ్యాంగ్ బ్యాంగ్ చిత్ర షూటింగ్ పోరాట సన్నివేశాల్లో హృతిక్ గాయపడగా, మెదడు పై పొరల్లో రక్తం గడ్డ కట్టింది. హృతిక్ ను పరీక్షించిన వైద్యులు సర్జరీ చేశారు. హృతిక్ కు నాలుగు వారాలపాటు విశ్రాంతి అవసరం అని వైద్యులు తెలిపారు. అయితే సర్జరీ అనంతరం హృతిక్ రోషన్ పరిస్ఠితి మెరుగ్గా ఉంది అని వైద్యులు తెలిపారు.

>