మరో హారర్ చిత్రంలో చెన్నై చిన్నది

6 May, 2016 02:49 IST|Sakshi
మరో హారర్ చిత్రంలో చెన్నై చిన్నది

33వ వసంతంలోకి అడుగు పెట్టి బుధవారం పుట్టిన రోజు జరుపుకున్న నటి త్రిషకు బర్త్‌డే గిఫ్ట్‌గా నూతన చిత్రంలో నటించే అవకాశం వరించింది. ఈ చెన్నై చిన్నది ప్రస్తుతం నాయకి చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం పూర్తి అయ్యే వరకూ మరో చిత్రం అంగీకరించని త్రిష ధనుష్‌తో నటిస్తున్న కొడి చిత్రాన్ని పూర్తి చేశారు. గత ఏడాది వరుసగా భూలోకం, తూంగావనం, అరణ్మణై-2 చిత్రాలతో విజయాలను తన ఖాతాలో వేసుకుందీ ముద్దుగుమ్మ.

తాజా చిత్రాలు కొడి, నాయకిపై చాలా ఆశలు పెట్టుకున్నారు. వీటిలో నాయకి ద్విభాషా చిత్రం కాగా త్రిష ఇందులో ద్విపాత్రాభినయం చేయడం విశేషం. నాయకి చిత్రం తరువాత ఈ బ్యూటీ నటించే చిత్రం ఏమిటన్న విషయం ఆసక్తిగా మారింది. తన తదుపరి చిత్రానికి త్రిష గ్రీన్ సిగ్నల్ ఇచ్చారన్నది తాజా సమాచారం. నాయకి చిత్రం హారర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.

 త్రిష నటించే తదుపరి చిత్రం కూడా హారర్ కథా చిత్రమేననీ తెలిసింది. ఇంతకు ముందు విజయ్ హీరోగా మధురై అనే విజయవంతమైన చిత్రాన్ని రూపొందించిన దర్శక నిర్మాత మాదేష్ తాజాగా త్రిష నాయకిగా హారర్ చిత్రాన్ని తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారని తెలిసింది. ప్రస్తుతం ఈ చిత్రంలో నటించే ఇతర తారాగణం, సాంకేతిక వర్గం ఎంపిక జరుగుతోందని సమాచారం. ఈ చిత్రానికి సంబంధించి అధికార పూర్వక ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశం ఉన్నట్లు తెలిసింది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి