మాధురీ, జయా బచ్చన్ లకు 'లచ్చూ' అవార్డు

23 Aug, 2013 16:21 IST|Sakshi
మాధురీ, జయా బచ్చన్ లకు 'లచ్చూ' అవార్డు

లక్నో: ప్రముఖ నటి మాధురీ దీక్షిత్,  రాజ్యసభ సభ్యురాలు, సీనియర్ నటి జయా బచ్చన్‌లు లచ్చూ మహారాజ్ అవార్డుకు ఎంపిక అయ్యారు. గతంలో శ్రీదేవి, జయప్రదలు సొంత చేసుకున్నఈ అవార్డు జాబితాలో తాజాగా వీరికి స్థానం దక్కింది. 2012 వ సంవత్సరానికి జయా బచ్చన్ ఎంపికవ్వగా, 2013వ సంవత్సరానికి గాను మాధురీ దీక్షిత్ ఎంపికైయ్యారు. వీరికి  ఈ ఆవార్డును త్వరలో అందివ్వనున్నట్లు శకుంతల నీరజ్ సంస్థాన్ శుక్రవారం ప్రకటించింది.
 
 దీనికి సంబంధించి వివరాలను సంస్థ డెరైక్టర్ కుంకమ్ ఆదర్శ్ ఐఏఎన్‌ఎస్‌కు వెల్లడించారు. కథక్ నృత్య కళాకారుడైన లచ్చూ మహారాజ్ స్మృతికి చిహ్నాంగా ఈ అవార్డును బహుకరించనున్నారు.  లచ్చూ మహారాజ్ 1972లో నృత్యదర్శకత్వంలో రూపొందిన ఏక్ నజర్ చిత్రంలో  జయా బచ్చన్ నటించడం విశేషం. కథక్ నాట్యంలో విశేష సేవలందిచిన ఆయన 1978లో మరణించారు. గతంలో ఈ ఆవార్డును గెలుచుకున్న వారిలో శ్రీదేవి, జయప్రదలతో పాటు ఆశా పరేఖ్,  రేఖ తదితరులున్నారు. లచ్చూ మహరాజ్‌కు స్వయానా మేనల్లుడైన బిర్జూ మహారాజ్ చేతులు మీదుగా మాధురీ దీక్షిత్, జయాబచ్చన్‌లు అవార్డును అందుకోనున్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
సినిమా