‘అ!’ సీక్వెల్‌లో టాప్‌ స్టార్స్‌!

17 Aug, 2019 13:50 IST|Sakshi

యంగ్ హీరో నాని నిర్మాతగా మారి తెరకెక్కించిన సినిమా అ!. ఈ సినిమాతో ప్రశాంత్ వర్మ దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ప్రయోగాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమా కమర్షియల్‌గా విజయం సాధించకపోయినా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. దీంతో ప్రశాంత్‌ వర్మకు ఆఫర్‌లు కూడా బాగానే వచ్చాయి.

ఇటీవల కల్కి సినిమాతో మరోసారి ఆకట్టుకున్న ప్రశాంత్‌, త్వరలో అ! సినిమాకు సీక్వెల్‌ను పట్టాలెక్కించే పనిలో ఉన్నాడట. ఈ సినిమాలో కాజల్‌ అగర్వాల్‌తో పాటు కోలీవుడ్ స్టార్ హీరో విజయ్‌ సేతుపతి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా కూడా కమర్షియల్ ఫార్మాట్‌లో కాకుండా డిఫరెంట్ కాన్సెప్ట్‌తోనే రూపొందుతున్నట్టుగా తెలుస్తోంది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా