కమల్ ఫ్లాప్ సినిమా రీ రిలీజ్

3 Jun, 2017 14:18 IST|Sakshi
కమల్ ఫ్లాప్ సినిమా రీ రిలీజ్

2001లో లోకనాయకుడు కమల్ హాసన్ హీరోగా తెరకెక్కిన డిఫరెంట్ మూవీ అభయ్. కమల్ డ్యూయల్ రోల్లో నటించిన ఈ సినిమా అప్పట్లో విశ్లేషకుల ప్రశంసలు అందుకుంది. ముఖ్యంగా సైకోగా కమల్ నటన, గ్రాఫిక్స్, టేకింగ్లకు మంచి స్పందన వచ్చింది. కానీ కమర్షియల్గా మాత్రం ఈ సినిమా నిరాశపరిచింది. సురేష్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఫ్లాప్ టాక్తో నిరాశపరిచింది. రవీనా టండన్, మనీషా కొయిరాల లాంటి టాప్ స్టార్స్ నటించిన ఈ సినిమాను ఇప్పుడు రీ రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు.

ఈ సినిమాకు ముందుగా అలవందన్ అనే టైటిల్ను నిర్ణయించారు. తెలుగులో అభయ్ అనే పేరుతో సినిమాను రిలీజ్ చేశారు. కానీ రీ రిలీజ్లో మాత్రం అలవందన్ టైటిల్నే ఫిక్స్ చేయాలని భావిస్తున్నారట. ఇప్పటి సాంకేతికతకు తగ్గట్టుగా డిజిటలైజ్ చేసి సినిమాను రిలీజ్ చేయనున్నారు. కలైపులి ఎస్ థాను ఈ రీ రిలీజ్కు ప్లాన్ చేస్తున్నారు. దాదాపు 500 థియేటర్లలో రిలీజ్ చేయాలని భావిస్తున్న ఈ సినిమా డిజిటలైజేషన్ పనులు ఇటీవల ప్రారంభమయ్యాయి. ఈ ఏడాది ద్వితియార్థంలో ఈ సినిమాను విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు.