తైమూరు పేరు మార్చాలని అనుకున్నాడు!

11 Mar, 2018 12:04 IST|Sakshi

సెలబ్రిటీల విషయంలో సోషల్‌ మీడియా వేదికగా అనేక కథనాలు చక్కర్లు కొడుతుంటాయి. అందులో ఏది నమ్మాలో, ఏది నమ్మకూడదో తెలియడం లేదు.  బాలీవుడ్‌ కపుల్‌ సైఫ్‌ అలీఖన్‌-కరీనా కపూర్‌ల తనయుడు తైముర్‌ అలీఖాన్‌ పేరుపై వివాదం కూడా అదే కోవలోకి వస్తుంది. తైముర్‌ జన్మించకముందు మరో పేరు అనుకున్నారని, ఇప్పుడు నెటిజన్ల వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో ఆ పాత పేరును మళ్లీ పెట్టారనే వార్త గత కొంతకాలంగా హల్‌చల్‌ చేస్తోంది. ఈ విషయాన్ని గతంలో కరీనా ఖండించారు. అయినా దీనికి తెరపడలేదు. కానీ శనివారం ఇండియా టుడే కంక్లేవ్‌లో పాల్గొన్న కరీనా ఈ వార్తలకు తెరదించే ప్రయత్నం చేశారు.

ఆమె మాట్లాడుతూ.. తైముర్‌ పేరుపై  రకరకాల వార్తలు వస్తున్నాయన్నారు. బాబు పుట్టక ముందే సైఫ్‌ అలీఖాన్‌.. ఫైజ్‌ అనే పేరును ప్రతిపాదించినా.. తాను ఒప్పుకోలేదని తెలిపారు. తైముర్‌ అనే పదానికి ఐరన్‌ మ్యాన్‌ అనే అర్థం వస్తుందని, తన బాబు కూడా అలాగే పెరగాలన్నది తన కోరిక అని తెలిపారు. బాబు పేరుని ఫైజ్‌గా మార్చాలని జనాల నుంచి చాలా ఒత్తిడి వచ్చిందన్నారు.  సైఫ్‌  కూడా బాబు పేరును మార్చడానికి సిద్ధపడ్డాడని ఆమె వెల్లడించారు. అయితే, తాను మాత్రం అందుకు అంగీకరించలేదని తెలిపారు. ఏదో ఒక రోజు తన కుమారుడు పేరుకు తగ్గట్టు ఐరన్‌ మ్యాన్‌ అవుతాడని ఆమె పేర్కొన్నారు. 

ఇక, మీడియాలో తన తనయుడిపై వస్తున్న వార్తలపై స్పందిస్తూ.. ఇప్పుడు తన కుమారుడి వయస్సు 14 నెలలు మాత్రమేనని, కానీ తనకు సంబంధించిన ప్రతి ఫొటో బయటికి ఎలా వస్తుందో తెలియడం లేదన్నారు. బాబు ఏం చేస్తున్నాడు, ఎక్కడికి వెళ్తున్నాడు, ఏ డ్రెస్‌ ధరించాడు, హెయిర్‌ స్టైల్‌ ఎలా ఉంది వంటి అంశాలపై కూడా చర్చ జరుగుతుందని ఆమె తెలిపారు. ఇది హర్షణీయం కాదన్నారు. మీడియా తనని అంతలా ఫాలో అవుతుంటే, దీన్ని ఎలా అదుపు చెయ్యాలో కూడా తెలియడం లేదన్నారు. 
 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా