వసంత కాలం వస్తోంది

16 Feb, 2020 03:22 IST|Sakshi
నయనతార, విఘ్నేష్‌ శివన్‌

నయనతార ప్రధాన పాత్రలో నటించిన తమిళ హారర్‌ చిత్రం ‘కొలయుతిర్‌ కాలమ్‌’. చక్రి తోలేటి దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని తెలుగులో ‘వసంత కాలం’ టైటిల్‌తో ఈ నెల 21న తెలుగులో విడుదల చేస్తున్నారు నిర్మాత దామెర వి.యస్‌. యస్‌ శ్రీనివాస్‌. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ – ‘‘ఏకవీర, వేటాడు వెంటాడు’ వంటి సినిమాలను తెలుగులో విడుదల చేశాం. నయనతార నటన, గ్లామర్‌ ‘వసంత కాలం’ సినిమాకు హైలెట్‌. తెలుగులోనూ పెద్ద విజయం సాధిస్తుంది అనుకుంటున్నాం’’ అన్నారు.

ప్రేమ వార్షికోత్సవం
‘‘నీతో కలసి ఉన్న ప్రతిరోజూ నాకు వేలంటైన్స్‌ డేనే. అప్పుడే 5 ఏళ్లయిపోయాయా? నమ్మబుద్ధి కావడం లేదు’’ అంటున్నారు దర్శకుడు విఘ్నేష్‌ శివన్‌. నయనతార, విఘ్నేష్‌ కొంతకాలంగా ప్రేమలో ఉన్నారు. 5 ఏళ్లుగా మేం రిలేషన్‌షిప్‌లో ఉన్నామని, 5 ఏళ్ల ప్రేమ వార్షికోత్సవం చేసుకుంటున్నాం అని విఘ్నేష్‌ పేర్కొన్నారు. ‘‘మా క్యూట్‌ స్టోరీకి ఐదేళ్లు అయింది. ఈ ఐదేళ్లు నీతో (నయన్‌) ప్రేమమయం అయిపోయింది’’ అని నయన్‌తో దిగిన ఫోటోలను షేర్‌ చేశారు విఘ్నేష్‌. ప్రస్తుతం విఘ్నేష్‌ నిర్మాణంలో ‘నెట్రిక్కన్‌’ అనే సినిమా, దర్శకత్వంలో ‘కాదు వాక్కుల రెండు కాదల్‌’ సినిమా చేస్తున్నారు నయనతార.

మరిన్ని వార్తలు