చాముండేశ్వరి ఆలయాన్ని సందర్శించిన రామ్‌ చరణ్‌, ద్రావిడ్‌

4 Dec, 2023 09:12 IST|Sakshi

భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ మైసూరులోని చాముండేశ్వరి ఆలయాన్ని సందర్శించి అమ్మవారిని దర్శించుకున్నారు. మరోవైపు గ్లోబల్‌ స్టార్‌ రామ్ చరణ్ కూడా వారాంతం ప్రారంభంలోనే చాముండేశ్వరిని దర్శించుకున్నారు.

రామ్ చరణ్ తన 'గేమ్ ఛేంజర్' చిత్ర బృందంతో కలిసి ఆలయానికి చేరుకున్నారు. ఆదివారం ఉదయం చాముండేశ్వరి దర్శనం చేసుకున్నారు. రామ్ చరణ్ తన తదుపరి చిత్రం గేమ్ ఛేంజర్ షూటింగ్ కోసం మైసూరులో ఉంటున్నారు. ఈ సందర్భంగా ఆయన ఆలయానికి వెళ్లారు. రాహుల్‌ ద్రావిడ్‌ తన కుమారుడి క్రికెట్ ఆట చూసేందుకు మైసూర్ వచ్చారు. ఇదే సమయంలో చాముండి కొండను ఆయన సందర్శించారు. కోచ్ రాహుల్ ద్రవిడ్ తన భార్య విజయతో కలిసి అమ్మవారిని దర్శించుకున్నారు.

అండర్-19 కూచ్ బెహార్ ట్రోఫీ క్రికెట్ టోర్నమెంట్ కర్ణాటక, ఉత్తరాఖండ్ మధ్య మైసూరులోని మానసంగోత్రిలో ఉన్న శ్రీకాంత్ దత్తా నరసింహరాజ వడయార్ స్టేడియంలో జరుగుతోంది. ఇందులో ద్రవిడ్ కుమారుడు ఆడుతున్నాడు. అతని ఆటను చూసేందుకు ద్రావిడ్‌తో పాటు అతని భార్య మైసూర్ చేరుకున్నారు. ఈ సందర్భంగా ఈ స్టార్స్‌ చాముండేశ్వరి అమ్మవారి ఆలయానికి వెళ్లడంతో ఫ్యాన్స్‌ ఫుల్‌ ఖుషి అయ్యారు. ద్రావిడ్‌,రామ్‌ చరణ్‌తో సెల్ఫీలు దిగారు.

>
మరిన్ని వార్తలు