మార్పు కోసం బ్రేక్‌!

13 Nov, 2019 00:05 IST|Sakshi

మహేశ్‌బాబు మారబోతున్నారు. అవును.. కొత్త లుక్‌లోకి మారబోతున్నారని సమాచారం. ‘సరి లేరు నీకెవ్వరు’ సినిమా తర్వాత మహేశ్‌ ఓ చిన్న బ్రేక్‌ తీసుకుంటారని ఇటీవల వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. కొత్త లుక్‌లోకి మారడానికే ఈ చిన్న విరామం అని తెలిసింది. ఈ మార్పు తన 27వ సినిమా కోసం అట. ‘కేజీఎఫ్‌’ దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ ఈ సినిమాని తెరకెక్కించనున్నారని టాక్‌. ఇందులో మహేశ్‌ కొత్త లుక్‌లో కనిపించడం మాత్రమే కాదు.. నాలుగు భాషల తెర మీద కనిపించనున్నారని భోగట్టా. తెలుగుతో పాటు తమిళ్, మలయాళం, హిందీ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుందని తెలిసింది. ప్యాన్‌ ఇండియన్‌ సినిమాగా ప్లాన్‌ చేస్తున్నారట. ప్రస్తుతం ‘కేజీఎఫ్‌’కి సీక్వెల్‌గా ప్రశాంత్‌ తెరకెక్కిస్తున్న ‘కేజీఎఫ్‌ 2’ వచ్చే ఏడాది ఏప్రిల్‌లో రిలీజ్‌ కానుంది. మహేశ్‌తో చేయబోయే సినిమా మేలో ఆరంభం అవుతుందట.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ప్రముఖ బాలీవుడ్ నిర్మాతకు పాజిటివ్

క్రికెట‌ర్‌ను కొట్టిన ప్రియ‌మ‌ణి..ఏమైందంటే?

బన్నీ ‘ఐకాన్‌’పై మరోసారి క్లారిటీ..

క‌రోనా వార్త‌ల‌పై నటి క్లారిటి

ప్ర‌భాస్‌ను చిక్కుల్లోకి నెట్టిన అభిమానులు

సినిమా

ప్రముఖ బాలీవుడ్ నిర్మాతకు పాజిటివ్

క్రికెట‌ర్‌ను కొట్టిన ప్రియ‌మ‌ణి..ఏమైందంటే?

బన్నీ ‘ఐకాన్‌’పై మరోసారి క్లారిటీ..

ప్ర‌భాస్‌ను చిక్కుల్లోకి నెట్టిన అభిమానులు

క‌రోనా వార్త‌ల‌పై నటి క్లారిటి

బన్ని బర్త్‌డే.. ‘నువ్వు బాగుండాలబ్బా’