‘చుట్టూ వంద మంది.. మధ్యలో ఒక్కడు’

5 Jan, 2020 21:30 IST|Sakshi

టాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ మహేశ్‌ బాబు హీరోగా క్రేజీ డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. రష్మిక మందన హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని అనిల్‌ సుంకర, దిల్‌ రాజు, మహేశ్‌ బాబులు నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతమందిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 11న వస్తున్న ఈ చిత్ర ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ ఆదివారం హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో అంగరంగవైభవంగా జరుగుతోంది. ఈ వేడుకకు మెగాస్టార్‌ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. చిరంజీవితో పాటు డైరెక్టర్స్‌ కొరటాల శివ, వంశీ, శ్రీనువైట్ల, టాలీవుడ్‌కు చెందిన ప్రముఖులు, నటీనటులు పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా ఈ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌లో అతిరథుల సమక్షంలో ‘సరిలేరు నీకెవ్వరు’  చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. అద్యంతం కామెడీగా సాగిన ఈ ట్రైలర్‌ అందరినీ ఆకట్టుకుంటోంది. రష్మిక అండ్‌ గ్యాంగ్‌ అల్లరి, మహేశ్‌ మ్యానరిజం సూపరో సూపర్‌. ‘ఇలాంటి ఎమోషన్స్‌ నెవర్‌ బిఫోర్‌ ఎవర్‌ ఆఫ్టర్‌’, ‘మియావ్‌ మియావ్‌ పిల్లి.. మిల్స్‌ బాబుతో పెళ్లి’, ‘15ఏళ్ల ప్రొఫెషనల్‌ కెరీర్‌లో తప్పును రైటని కొట్టలేదు..’,‘‘చుట్టూ వంద మంది.. మధ్యలో ఒక్కడు’అంటూ ట్రైలర్‌లో వచ్చే డైలాగ్‌లు హైలెట్‌గా నిలిచాయి. ఇక ఆఖర్లో మహేశ్‌ చెప్పే లాస్ట్‌ డైలాగ్‌ ‘చిన్న బ్రేక్‌ ఇస్తున్నా.. తర్వాత బొమ్మ దద్దరిల్లిపోద్ది’ ట్రైలర్‌కు హైలెట్‌గా నిలిచింది. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

‘ఆచార్య’లో మహేశ్‌.. చిరు స్పందన

తారా దీపం

ఇప్పట్లో పెళ్లి ఆలోచన లేదు

పేద సినీ కార్మికులకు సహాయం

మహేష్‌ మేనల్లుడు అశోక్‌ లుక్‌ రివీల్‌..

సినిమా

‘ఆచార్య’లో మహేశ్‌.. చిరు స్పందన

తారా దీపం

ఇప్పట్లో పెళ్లి ఆలోచన లేదు

పేద సినీ కార్మికులకు సహాయం

మహేష్‌ మేనల్లుడు అశోక్‌ లుక్‌ రివీల్‌..

బన్నీ బర్త్‌ డే.. ముందే సర్‌ప్రైజ్‌ ఇచ్చిన దేవీశ్రీ