ఛీ.. మేకప్‌ లేకుండానే బాగున్నావు

27 Nov, 2019 12:56 IST|Sakshi

మలైకా అరోరా.. పవన్‌ కళ్యాణ్‌ గబ్బర్‌సింగ్‌లో కెవ్వుకేక పాటతో ఇటు టాలీవుడ్‌కు.. ఐటంసాంగ్స్‌తో అటు బాలీవుడ్‌కు పరిచయం చేయక్కర్లేని పేరు. లేటు వయసులోనూ తన ఫిట్‌నెస్‌ను కాపాడుకుంటూ ఫొటోషూట్‌లతో అభిమానులను మురిపిస్తూ ఉంటుంది. ఇక బాలీవుడ్‌ కండలవీరుడు సల్మాన్‌ఖాన్‌ తమ్ముడు అర్భాజ్‌ఖాన్‌తో వివాహబంధానికి మలైకా కటీఫ్‌ చెప్పిన సంగతి తెలిసిందే. అయితే గత కొంతకాలంగా మలైకా.. తనకంటే చిన్నవాడైన అర్జున్‌కపూర్‌తో రెండో పెళ్లికి సిద్ధమవుతోందని టాక్‌ వినిపిస్తోంది. ఇదిలా ఉండగా తాజాగా ఈ భామ ఓ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది.

దీన్ని చూసిన కొంతమంది అభిమానులు.. ఎంతందంగా ఉన్నావే.. అని పాట పాడుకుంటుంటే, మరికొందరేమో ‘ఛీ.. మేకప్‌తో చూడలేకున్నాం. మేకప్‌ లేకుండానే బాగుందంటూ’ కామెంట్లు చేస్తున్నారు. మరికొంతమంది నెటిజన్లు మాత్రం ‘ఈ ఫొటోలో మరీ ముసలిదానిలా కనిపిస్తున్నావు’ అంటూ మలైకాను ఆడేసుకుంటున్నారు. మలైకా ఈ ఫొటోలో అచ్చు బాలీవుడ్‌ సెన్సేషన్‌ రణు మొండాల్‌లా ఉందంటూ ఆమెతో పోల్చుతూ చురకలంటిస్తున్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

డ్రైవర్‌ పుష్పరాజ్‌

చిన్న స్క్రీన్‌ పెద్ద ఊరట

ప్రముఖ బాలీవుడ్ నిర్మాతకు పాజిటివ్

క్రికెట‌ర్‌ను కొట్టిన ప్రియ‌మ‌ణి..ఏమైందంటే?

బన్నీ ‘ఐకాన్‌’పై మరోసారి క్లారిటీ..

సినిమా

డ్రైవర్‌ పుష్పరాజ్‌

చిన్న స్క్రీన్‌ పెద్ద ఊరట

ప్రముఖ బాలీవుడ్ నిర్మాతకు పాజిటివ్

క్రికెట‌ర్‌ను కొట్టిన ప్రియ‌మ‌ణి..ఏమైందంటే?

బన్నీ ‘ఐకాన్‌’పై మరోసారి క్లారిటీ..

ప్ర‌భాస్‌ను చిక్కుల్లోకి నెట్టిన అభిమానులు