ఇంతకంటే సంతోషం ఏముంటుంది : మనోజ్‌

16 Jan, 2020 19:54 IST|Sakshi

సంక్రాంతి పండగ సందర్భంగా హీరో మంచు మనోజ్‌కు సొంతూరు చిత్తూరు జిల్లాలోని రంగంపేటకు వెళ్లారు. ఈ క్రమంలో రంగంపేట చుట్టుపక్కల నుంచి ఆయనను చూసేందుకు భారీగా అభిమానులు తరలివచ్చారు. తనకోసం వచ్చిన అభిమానలకు బిల్డింగ్‌ పైనుంచి అభివాదం చేసిన మనోజ్‌.. వారికి కృతజ్ఞతలు తెలిపారు. తిరుపతి చుట్టుపక్కల జరిగే కనుమ పండగ ఎప్పటికీ గుర్తుండిపోతుందని మనోజ్‌ అన్నారు. సొంత ఊరిలో పండగ జరుపుకోవడం కంటే సంతోషం ఏముంటందన్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను మనోజ్‌ ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు.

‘మా ఊరు(రంగంపేట) చుట్టుపక్కల నుంచి ఏమి ఆశించకుండ ఇక్కడకు వచ్చి నాపై ప్రేమ కనబరుస్తున్నందకు సంతోషంగా ఉంది. నాకు ఆశీస్సులు అందజేసిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు. లవ్‌ యూ ఆల్‌ సో మచ్‌’ అని మనోజ్‌ పేర్కొన్నారు. అలాగే రేణిగుంటలోని అభయక్షేత్రం అనాథశ్రమంకు వెళ్లిన మనోజ్‌ అక్కడి చిన్నారులతో సరదాగా గడిపారు. ఈసారి పండగ చాలా ప్రత్యేకమైనదని పేర్కొన్నారు. ఎంతో ప్రతిభగల చిన్నారులతో గడపటం చాలా ఆనందాన్ని ఇచ్చిందన్నారు. తన చివరి వరకు ఆ పిల్లల కోసం ఉంటానని చెప్పారు. 

మరిన్ని వార్తలు