రివ్యూ వివాదంపై స్పందించిన విష్ణు

28 Sep, 2017 08:03 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: 'జై లవ కుశ' సక్సెస్‌మీట్‌లో సినీ విమర్శకులు వ్యవహరిస్తున్న తీరుపై యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ చేసిన వ్యాఖ్యలు హాట్‌ టాపిక్‌గా మారగా.. ఇదే అంశంపై తాజాగా నటుడు మంచు విష్ణు స్పందించారు. కష్టపడి తెరకెక్కిస్తున్న మూవీలకు కొందరు సమీక్షకులు అసలైన రివ్యూలు ఇవ్వడం లేదంటూ ఆయన ఆందోళన వ్యక్తంచేశారు. మూవీని కాస్త శ్రద్ధగా, ఏకాగ్రతతో చూస్తే సరైన సమీక్ష బయటకు వస్తుందని ట్వీట్టర్ ద్వారా పేర్కొన్నారు.. కానీ ప్రస్తుతం కొందరు సమీక్షకులు మూవీ చూస్తుండగానే అప్‌డేట్స్ ద్వారా రివ్యూలు ఇస్తున్నట్లు ఆయన అభిప్రాయపడ్డారు. మూవీ చూస్తున్నప్పుడు ఎలాంటి అప్‌డేట్స్ ఇవ్వొద్దంటూ సమీక్షకులకు సూచిస్తూ విష్ణు ట్వీట్ చేశారు.

ఇటీవల విడుదలై భారీ కలెక్షన్లతో దూసుకుపోతున్న మూవీ 'జై లవ కుశ'. బాబీ దర్శకత్వంలో వచ్చిన 'జై లవ కుశ'  చిత్రంలో జూనియర్ మూడు పాత్రల్లో నటించి మెప్పించారు. ఈ చిత్రానికి క్రిటిక్స్ బిలో యావరేజ్ రేటింగ్స్ తో సరిపెట్టారు. ఇలా నెగిటీవ్‌ రివ్యూలు ఇవ్వడంపై తారక్ ఇటీవల ఆగ్రహం వ్యక్తంచేసిన విషయం తెలిసిందే. 'హాస్పటల్లో మన కుటుంబసభ్యులెవరైనా క్రిటికల్‌ కండిషన్‌తో ఎమర్జెన్సీ వార్డులో ఉంటే.. డాక్టర్లు ఏం చెబుతారో? మనం ఆశలు పెట్టుకోవచ్చో? లేదో? అని ఎదురు చూస్తుంటాం. టెస్టులు చేసిన తర్వాత చెబుతామని ఎన్నో ఏళ్లు అనుభవం గల, చదువుకున్నటువంటి డాక్టర్లు చెబుతారు. ఈలోపు దారినపోయే దానయ్యలు కొందరు అన్నీ తెలిసినట్టే ‘బతకడు. పోతాడు’  అంటుంటారని ఎన్టీర్ వ్యాఖ్యానించారు.

మరిన్ని వార్తలు