మణిశర్మ నిర్మాతగా త్రీడీ సినిమా

18 Jan, 2014 01:18 IST|Sakshi
మణిశర్మ నిర్మాతగా త్రీడీ సినిమా

సంగీత దర్శకుడు మణిశర్మ నిర్మాతగా మారారు. ‘వస్తాడు నా రాజు’ ఫేమ్ హేమంత్ మధుకర్ దర్శకత్వంలో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఆయన నిర్మించిన చిత్రం ‘ముంబాయి 125 కి.మీ’. కరణ్‌వీర్ బోరా, విదిత ప్రతాప్‌సింగ్, వీణామాలిక్, అపర్ణా బాజ్‌పాయ్ ఇందులో ముఖ్యతారలు. దర్శకుడు మాట్లాడుతూ -‘‘త్రీడీ హారర్ చిత్రమిది. మొత్తం తలకోన, ముంబై అడవుల్లో చిత్రీకరించాం. మణిశర్మ సంగీతం ఈ సినిమాకు మెయిన్ హైలైట్. ఈ నెలాఖరున హైదరాబాద్‌లో పాటలు విడుదల చేయబోతున్నాం’’ అని తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: మనోజ్ షా.