మహేష్‌ చేతుల మీదుగా ‘మీకు మాత్రమే చెప్తా’  ట్రైలర్‌

16 Oct, 2019 19:04 IST|Sakshi

ఈ రోజుల్లో స్మార్ట్‌ ఫోన్లు వాడని వారు ఎవరూ లేరు. ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్‌ఫోన్‌ ఉంటుంది. ప్రతి ఒక్కరి స్మార్ట్‌ఫోన్‌లో కనీసం ఒక్క రహస్యమైనా నిక్షిప్తమై ఉంటుంది. అలాంటి ర‌హస్యం దాచుకున్న ఓ స్మార్ట్ ఫోన్ మాయం అయితే.., అందులో ఉన్న సీక్రెట్ బ‌య‌ట‌కు వ‌చ్చేస్తే.. అప్పుడు ఏం జ‌రుతుంది?  మన దేశంలో ప్రతి ఒక్కరు సుమారుగా 6 గంటల పాటు స్మార్ట్‌ఫోన్‌లో వీడియోలు చూస్తారట. వాటిల్లో మన వీడియో ఉంటే? ఇలాంటి డిఫెరెంట్‌ కాన్సెప్ట్‌తో వస్తున్న సినిమాయే ‘ మీకు మాత్రమే చెప్తా’. యువ దర్శకుడు తరుణ్ భాస్కర్ ను హీరోగా పరిచయం చేస్తూ విజయ్ దేవరకొండ తన సొంత బ్యానర్‌లో ఈ సినిమాను నిర్మించాడు. 

సూపర్‌స్టార్‌ మహేష్‌ బాబు చేతుల మీదుగా బుధవారం ‘మీకు మాత్రమే చెప్తా’ ట్రైల‌ర్ విడుద‌లైంది. వెన్నెల కిషోర్ వాయిస్ ఓవ‌ర్‌తో ఈ ట్రైల‌ర్‌ను విడుదల చేశారు. ట్రైలర్‌ ప్రకారం.. పెళ్లికి ఒక్క రోజు ముందే హీరోకి సంబంధించిన ఓ సీక్రేట్‌ వీడియో లీకైపోతుంది. దీంతో హీరో అండ్‌ గ్యాంగ్‌ కంగారు పడిపోతుంది. వీడియో వల్ల పెళ్లి ఆగిపోతే ఎలా? తల్లిదండ్రులు ఈ వీడియో చూస్తే ఎంటి పరిస్థితి. పుట్టబోయే కొడుకు ఆ వీడియో చూస్తే ఎంత ఘోరంగా ఉంటుందని అని హీరో టెన్షన్‌ పడతాడు. అసలు లీకైన వీడియో ఎంటి.. హీరో ఎందుకు అంత టెన్షన్‌ పడుతున్నాడు అని తెలుసుకోవాలంటే సినిమా విడుదల దాకా ఆగాల్సిందే.

తరుణ్‌ భాస్కర్‌ నటన సహజంగా ఉంది. అతను చెప్తే డైలాగ్స్‌ ఫన్నీగా అనిపించాయి. విజ‌య్ దేవ‌ర‌కొండ‌ని అక్కడక్కడ అనుక‌రిస్తున్నాడేమో అనిపిస్తోంది. ట్రైలర్‌లో చూపించిన ఫన్‌ వర్కవుట్‌ అయితే.. నిర్మాత‌గా విజయ్‌కు తొలి విజ‌యం ద‌క్కిన‌ట్టే. తరుణ్ భాస్కర్, అభినవ్ గోమటం, అనసూయ భరద్వాజ్, వాణి భోజన్, పావని గంగిరెడ్డి, నవీన్ జార్జ్ థామస్, వినయ్ వర్మలు నటించిన ఈ కామెడీ ఎంటర్టైనర్‌కు షమ్మిర్ సుల్తాన్ రచన, దర్శకత్వం వహిస్తున్నారు. 

మరిన్ని వార్తలు