మేము బ్రేకప్‌​ అవ్వలేదు : నటుడు

19 Apr, 2018 17:07 IST|Sakshi

ప్రముఖ నటుడు, భారత మాజీ సూపర్ మోడల్ మిలింద్‌ సోమన్‌, అంకిత కోన్వర్‌ల ప్రేమ జంట బ్రేకప్‌ అయిందని పుకార్లు హల్‌చల్‌ చేశాయి. ఈ వార్తలపై ఆ ప్రేమజంట స్పందించింది. మేము కలిసే ఉ‍న్నాం విడిపోలేదని తాజాగా ఇన్‌స్ట్రాగ్రామ్‌లో వారు ఫొటోలను పోస్ట్‌ చేశారు. 52 ఏళ్ల మిలింద్‌ 23 ఏళ్ల అంకితలు ప్రేమించుకుంటున్న సంగతి తెలిసిందే. తమ ప్రేమను ఈ జంట పెళ్లి వరకూ తీసుకు వచ్చింది. కాగా, వీరు పెళ్లికి రెండు రోజుల ముందు డబ్బు విషయంలో విడిపోయారనే వార్తలు బాలీవుడ్‌లో చక్కర్లు కొట్టాయి. దీంతో తాము విడిపోలేదని, ఇదంతా పుకార్లేనని తెలుపుతూ మిలింద్‌ ఇన్‌స్ట్రామ్‌లో అంకితతో కలిసి దిగిన ఫోటోలను పోస్ట్‌ చేశాడు. అంకిత కూడా ఆ ఫోటోలను షేర్‌ చేసింది. 

‘మంచిపై దృష్టి పెట్టండి. మంచి అలవాట్లతో మంచి జీవితాన్ని గడుపుతారు’ , చుట్టుపక్కల వారిని ప్రేమించండి’ అంటూ మిలిందర్‌ తమ ఫొటోలను ఇన్‌స్ట్రాగ్రామ్‌లో పోస్ట్‌ చేశాడు. దీంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. తమ సంతోషాన్ని తెలుపుతూ.. కామెట్స్‌ కూడా రాశారు. ‘ నాకు తెలిసి మీరు విడిపోరు. ఈ వార్తలు అన్ని పుకార్లే అనుకున్నా’ , మీ ఇద్దరిని ఇలా చూస్తుంటే సంతోషంగా ఉంది, జీవితాంతం ఇలానే కలిసి ఉండండి’  అంటూ అభిమానులు పోటోలపై కామెంట్స్‌  చేస్తున్నారు.

మిలిందర్‌ అంకితను పెళ్లి చేసుకుంటే ఆయనకు ఇది రెండో పెళ్లి అవుతుంది. గ‌తంలో ఫ్రెంచ్ న‌టి మైలీన్ జంప‌నోయినను మిలింద్ వివాహం చేసుకున్నారు. 2006 నుంచి 2009 వ‌రకు వీరి దాంప‌త్య జీవితం కొన‌సాగింది. గతంలో కూడా మిలింద్, సూప‌ర్ మోడ‌ల్ మ‌ధు స‌ప్రేతో ప్రేమాయ‌ణం న‌డిపాడు.

మరిన్ని వార్తలు