అవ్రామ్‌ భక్త మంచు...గ్రాండ్‌ సన్నాఫ్‌ భక్తవత్సలం నాయుడు

5 Jan, 2018 00:19 IST|Sakshi

భక్తవత్సలం నాయుడు ఎవరో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ‘మంచు మోహన్‌బాబు’. ఈ విలక్షణ నటుణ్ణి ఆయన సన్నిహితులు ‘భక్తా’ అని పిలుస్తుంటారు. స్క్రీన్‌ నేమ్‌ ఎంత కలిసొచ్చినా ఒరిజినల్‌ నేమ్‌ అంటే ఓ స్పెషల్‌ మమకారం ఉంటుంది కదా. అందుకే మనవడికి తన పేరు వచ్చేలా పేరు పెట్టారు మోహన్‌బాబు. విష్ణు భార్య విరానిక ఇటీవల ఒక బాబుకి జన్మనిచ్చిన విషయం తెలిసిందే. ఈ బేబీ బాయ్‌కి ‘అవ్రామ్‌ భక్త మంచు’ అని పేరు పెట్టినట్లు గురువారం విష్ణు సోషల్‌ మీడియా ద్వారా పేర్కొన్నారు. విష్ణుకి ఆల్రెడీ ఇద్దరు కుమార్తెలు ఉన్న విషయం తెలిసిందే.

అప్పుడే తమ్ముణ్ణి ఏమని పిలవాలో ఈ చిన్నారులు డిసైడ్‌ అయ్యారట. ‘‘అరియానా ‘బేబీ లయన్‌’ అని పిలుస్తుంది. వివియానా ‘బేబీ టెడ్డీబేర్‌’ అని పిలుస్తుంది. మేమంతా అవ్రామ్‌ భక్త మంచు అని పిలుస్తున్నాం. అవ్రామ్‌ అంటే.. వన్‌ హూ కెనాట్‌ స్టాప్‌ అని అర్థం’’ అని విష్ణు అన్నారు. ‘‘నా బిడ్డలు పుట్టినప్పుడు... త్రీ షిప్ట్స్‌లో షూటింగ్‌ చేస్తూ బిజీగా ఉన్నందున వారికి సమయం కేటాయించలేకపోయాను. కానీ ఇప్పుడు నా మనవడు పుట్టగానే త్రీ షిప్ట్స్‌ వాడితోనే గడుపుతున్నాను ’’ అని మోహన్‌బాబు పేర్కొన్నారు. ఈ కుటుంబానికి సంక్రాంతి ముందే వచ్చేసింది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు