దిమాక్‌ ఖరాబ్‌.. దిల్‌ ఖుష్‌!

27 Jul, 2019 09:20 IST|Sakshi
విలేకరులతో మాట్లాడుతున్నదర్శకుడు పూరీ, పక్కన నిర్మాత ఛార్మి, హీరోయిన్‌ నిధి అగర్వాల్‌

‘ఇస్మార్ట్‌ శంకర్‌’ కలెక్షన్ల జోరుతో థ్రిల్లై పోయా

తెలంగాణ యాసకు ఆంధ్రా జనం ఫిదా

బ్లాక్‌ బస్టర్‌ మూవీగా ఆదరణ అద్భుతం

సాక్షి, మద్దిలపాలెం(విశాఖ తూర్పు): ఫుల్‌ మాస్‌ ఎంటర్‌టైనర్‌.. కుర్రాళ్లు మళ్లీ పూర్వం రోజుల్లో మాదిరి థియేటర్లలో సందడి చేసే సరదా మూవీ ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ అని ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్‌ అన్నారు. ఆంధ్రాలో కలెక్షన్లు, ఆదరణ చూస్తుంటే దిమాక్‌ ఖరాబ్‌ అవుతోందని చమత్కరించారు, తెలంగాణ యాసతో, సా హసంతో తెరకెక్కించిన మాస్‌ మూవీకి ప్రేక్షక దేవుళ్లు బ్రహ్మరథం పడుతున్నారని చెప్పారు. చిత్ర విజయోత్సవంలో భాగంగా శుక్రవారం సాయంత్రం ఓ హోటల్‌లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎనర్జీటిక్‌ హీరో రామ్‌ను దృష్టిలోపెట్టుకుని పూరా మాస్‌ ఓరియంటెండ్‌ బ్యాక్‌డ్రాప్‌లో ఇస్మార్ట్‌ శంకర్‌ కథను తయారు చేసి, తెరకెక్కించానన్నారు. చిత్రం ఆద్యంతం ఫుల్‌ ఎనర్జిటిక్‌గా ఉండడంతో కుర్రాళ్లు కేక పుట్టిస్తున్నారని చెప్పారు. ‘ఈ మూవీ ప్రదర్శిస్తున్న థియేటర్ల వద్ద కుర్రాళ్లు చేస్తున్న సందడి చూస్తుంటే గత వైభవం కళ్లెదుట కదులుతోంది. అప్పట్లో అభిమాన హీరో చిత్రం రిలీజ్‌ ఫ్యాన్స్‌ చేసే సందడి మళ్లీ కనిపిస్తోంది.’ అని చెప్పారు. 

‘పూర్తిగా తెలంగాణ బ్యాక్‌ డ్రాప్‌లో.. హీరో రామ్‌కు తెలంగాణ యాస పెట్టి తీసిన చిత్రానికి ఆంధ్రలో యమా క్రేజ్‌ వచ్చింది. తెలంగాణ యాసలో రామ్‌ పలికిన డైలాంగ్‌లకు యూత్‌ బాగా కనెక్ట్‌ అయ్యారు.’ అని చెప్పారు. ఆస్ట్రేలియా చిత్రం ‘ది స్నేక్‌’ చూశాక, తనకు బ్రెయిన్‌ ట్రాన్స్‌ఫర్‌ ఐడియా వచ్చిందని, అదే ఊపుతో కథను సిద్ధం చేశానని పూరీ చెప్పారు. ఈ కథకు వేరెవరితో సం బం ధం లేదని స్ప ష్టం చేశారు. ‘మాస్‌ కథాం శానికి క్లాస్‌ టచ్‌ ఇచ్చి తీశాను. ఎ లా రిసీవ్‌ చేసుకుం టారోనన్న మి మాంస ఉండేది. అ యితే ఫస్ట్‌డే ఫస్ట్‌ షో నుంచి పాజిటివ్‌ టాక్‌తో మూవీ బ్లాక్‌బస్టర్‌ అయింది. ఇందుకు  ప్రేక్షక దేవుళ్లకు రు ణపడి ఉంటా.’అన్నారు. 

కలెక్షన్ల హోరు 
‘కథలో కొత్తదనం ఉందన్న నమ్మకంతో, యూత్‌కు బాగా కనెక్ట్‌ అవుతుందన్న విశ్వాసంతో హీరో రామ్‌ బాడీ స్టైల్‌కు తగ్గట్టుగా కథనాన్ని పూరీ జగన్నాథ్‌ నడిపించారు. ప్రేక్షకులు కలెక్షన్లతో హోరెత్తిస్తున్నారు.’ అన్నారు నిర్మాత, హీరోయిన్‌ ఛార్మి.  విడుదలైన తొ మ్మిది రోజుల్లోనే  రూ.63 కోట్లు రాబట్టుకుందన్నా రు. ‘చిత్రం విజయం గురించి చెప్పడానికి మాటలు రావడంలేదు. ఎమేజింగ్‌ హిట్‌. పూరీ ఫాన్‌గా, నిర్మాతగా నాకు ఇంత గొప్ప చిత్రం ఇచ్చినందుకు ఆయనను అభినందిస్తున్నాను.’ అని చెప్పారు. 

ఇక్కడ ఉండిపోవాలని ఉంది..
‘వైజాగ్‌ లవ్లీ బ్యూటీఫుల్‌ స్మార్ట్‌సిటీ. ఈ సిటీలో పూరా మాస్‌ మూవీ ఇస్మార్ట్‌శంకర్‌కు మంచి హిట్‌ ఇ చ్చినందుకు థ్యాంక్స్‌. ఇక్కడ బీచ్‌ ను, గ్రీనరీని చూస్తుంటే ఇక్కడే ఉం డిపోవాలనిపిస్తుంది.’ అని హీరోయిన్‌ నిధి అగర్వాల్‌ అన్నా రు. తనకు గొప్ప హిట్‌ ఇచ్చి కెరీర్‌కు బాటలు వేశారన్నారు.

చిలక.. చిలక సాంగ్‌ హోరు
పూరీ దర్శకత్వంలో 27 చిత్రాలకు గీత రచయితగా పనిచేసినా ‘ఇస్మా ర్ట్‌ శంకర్‌’లో చిలక..చిలక సాంగ్‌కు వస్తున్న క్రేజ్‌ను ఇంతవరకు చూడలేదని గీత రచయిత భాస్కరభట్ల అన్నారు. చిత్రంలో అన్ని పాటలూ రాయడమే కాకుండా.. యూత్‌ కనెక్ట్‌ అయ్యే పదాలతో గీత రచన చేసినట్టు చెప్పారు. పాటలకు తగ్గట్టుగా మణిశర్మ బాణీలు అందించారని చెప్పా రు. సమావేశంలో సురేష్‌ మూ వీస్‌ ప్రతినిధి పాల్గొన్నారు. 
  

మరిన్ని వార్తలు