ఇంటింటికీ కాంగ్రెస్‌

27 Jul, 2019 09:18 IST|Sakshi

మున్సి‘పోల్‌’ నేపథ్యంలో సన్నాహాలు

జిల్లాలో 29 నుంచి ప్రచారం

స్థానిక సమస్యలతో ఎన్నికల ప్రణాళిక ఖరారు

ప్రతి మున్సిపాలిటీలో ఫైవ్‌మెన్‌ కమిటీ ఏర్పాటు  

సాక్షి,మేడ్చల్‌ జిల్లా: మున్సిపల్‌ ఎన్నికలకు సిద్దమవుతున్న కాంగ్రెస్‌ పార్టీ ఈ నెల 29 నుంచి మూడు రోజుల పాటు మేడ్చల్‌–మల్కాజిగిరి జిల్లాలో 13 మున్సిపాలిటీల్లో ఇంటింటికి కాంగ్రెస్‌ కార్యక్రమంతో ప్రజల వద్దకు వెళ్లాలని నిర్ణయించింది. టీపీసీసీ శనివారం నుంచి ఇంటింటికి కాంగ్రెస్‌ కార్యక్రమం చేపట్టాలని సూచించినప్పటికీ శని,ఆది వారాల్లో బోనాల పండగ ఉన్నందున జిల్లాలో సోమవారం నుంచి చేపట్టాలని జిల్లా నేతలు నిర్ణయించారు. ఇందులో భాగంగా మేడ్చల్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో బోడుప్పల్, పీర్జాదిగూడ, జవహర్‌నగర్‌ మున్సిపల్‌ కార్పొరేçషన్లతోపాటు  మేడ్చల్, గుండ్లపోచంపల్లి, తూమ్‌కుంట ,నాగారం, దమ్మాయిగూడ, ఘట్కేసర్, పోచారం మున్సిపాలిటీలు, కుత్బుల్లాపూర్‌ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని నిజాంపేట్‌ మున్సిపల్‌ కార్పోరేషన్‌తోపాటు దుండిగల్, కొంపల్లి మున్సిపాలిటీల్లో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు జిల్లా నాయకత్వం సన్నాహాలు చేస్తోంది. మున్సిపల్‌ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని నాయకులు మనస్పర్దలు వీడి, కలిసికట్టుగా కాంగ్రెస్‌ అభ్యర్థుల ఎంపికతోపాటు పార్లమెంట్‌ ఎన్నికల్లో మాదిరిగా పార్టీ విజయమే లక్ష్యంగా ముందుకెళ్లాలని నిర్ణయించారు.

అందులో భాగంగా మేడ్చల్‌ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఐదుగురితో కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ సం యుక్తంగా  మేడ్చల్‌ నియోజకవర్గంలోని 10 మున్సిపాలిటీల్లో ఐదుగురు చొప్పున ఎన్నికల కమిటీలను నియమించి .. వార్డుల నుంచి పోటీలో నిలిపే పార్టీ అభ్యర్థులను ఖరారు చేస్తుంది. అలాగే ఎన్నికల ప్రచార బాధ్యతలను మీద వేసు కుని అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేయనుంది. అందులో భాగంగా మేడ్చల్‌ అసెంబ్లీ పరిధిలో టీపీసీసీ ఉపాధ్యక్షుడు ఉద్దమర్రి నర్సింహారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ మాదాల రంగారెడ్డి,  మాజీ ఎమ్మెల్యే కేఎల్‌ఆర్, కాంగ్రెస్‌ పార్టీ ఓబీసీ సెల్‌ రాష్ట ఛైర్మన్‌ తోటకూరి జంగయ్య(వజ్రేష్‌)యాదవ్‌ , కాంగ్రెస్‌ పార్టీ జడ్పీ ప్లోర్‌ లీడర్‌ సింగిరెడ్డి హరివర్ధన్‌రెడ్డితో ఫైవ్‌మేన్‌  కమి టీ ఏర్పడింది. ఈ కమిటీ నియోజకవర్గం లోని 10 మున్సిపాలిటీల్లో ఫైవ్‌మేన్‌ కమిటీలను నియమించనుంది. కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గంలో పార్టీ జిల్లా అ««ధ్యక్షుడు కూన శ్రీశైలంగౌడ్‌ నేతృత్వంలో మూడు మున్సిపాలిటీల్లో  ఫైవ్‌మెన్‌ కమిటీలను ఏర్పాటు చేయనున్నారు. ఈ కమిటీలను ఇంటింటికి కార్యక్రమంలోభాగంగా నియమించనున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నా యి. ఈ సందర్భంగా మున్సిపాలిటీ పరిధిలోని సమస్యలను గుర్తించి మేనిఫెస్టోను రూపొందించి ఎన్నికల్లో ప్రచారం చేయనున్నట్లు జిల్లా కాంగ్రెస్‌ వర్గాలు తెలిపాయి. 

మరిన్ని వార్తలు