మనిషిని దెయ్యం ప్రేమిస్తే...

13 Jul, 2018 00:36 IST|Sakshi
తనిష్క

‘‘ఈ రోజుల్లో చిన్న సినిమాలు విడుదల కావడం చాలా కష్టంగా మారింది. వీటి మనుగడ ఉన్నప్పుడే పరిశ్రమ పచ్చగా ఉంటుంది. అందుకే తెలంగాణ ప్రభుత్వం చిన్న సినిమాల కోసం ఓ ప్రత్యేక చానల్‌ను ఏర్పాటు చేస్తోంది. శాటిలైట్‌ రైట్స్‌ వైజ్‌గా చిన్న సినిమాలకు ఇది మంచి అవకాశం’’ అని నిర్మాత ప్రతాని రామకృష్ణ గౌడ్‌ అన్నారు. సుజయ్, చంద్రకాంత్, తనిష్క, రష్మీ, సోని ముఖ్య తారలుగా తెరకెక్కిన చిత్రం ‘నాకు మనసున్నది’. రాజశేఖర్‌ దర్శకత్వంలో సాయి హాసిని ప్రొడక్షన్స్‌ పతాకంపై నాన్చేరి దేవా శంకర్‌గౌడ్‌ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 20న విడుదల కానుంది.

ఈ సందర్భంగా ప్రతాని రామకృష్ణ గౌడ్‌ ట్రైలర్‌ రిలీజ్‌ చేసారు. రాజశేఖర్‌ మాట్లాడుతూ– ‘‘ఒక దెయ్యం మనిషిని ప్రేమిస్తే ఎలా ఉంటుందన్న ఆసక్తికర కథాంశంతో సాగే సినిమా ఇది. సినిమా పూర్తయి చాలా రోజులవుతున్నా విడుదల పెద్ద టెన్షన్‌గా మారింది.  నిర్మాత సాయి వెంకట్‌గారు, ప్రతానిగారు, డైరెక్టర్‌ సిరాజ్‌ సపోర్ట్‌తో ఈ నెల 20న విడుదల చేస్తున్నాం’’ అన్నారు. ‘‘ఇప్పటి వరకూ ఎన్నో దెయ్యం సినిమాలు వచ్చాయి. కానీ, మా సినిమా చాలా కొత్తగా ఉంటుంది’’ అన్నారు చిత్ర నిర్మాత శంకర్‌ గౌడ్‌. నిర్మాత సాయి వెంకట్‌ పాల్గొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: ఉదయ్‌ శంకర్, కెమెరా: వెంకీ పెద్దాడ.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు