నాగేంద్రప్రసాద్ చిత్రం నాలుగో రోజు విశేషాలు

16 Oct, 2014 23:23 IST|Sakshi
నాగేంద్రప్రసాద్ చిత్రం నాలుగో రోజు విశేషాలు

 స్కిప్ట్ టు స్క్రీన్
 
 గిన్నిస్‌బుక్ రికార్డు కోసం నాగేంద్రప్రసాద్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం
 నాలుగో రోజు విశేషాలు
 
 పది రోజుల్లో ‘స్క్రిప్ట్ టూ స్క్రీన్’ అనే కాన్సెప్ట్‌తో గిన్నిస్ బుక్ రికార్డు కోసం రూపొందిస్తున్న చిత్రం షూటింగ్, సాంకేతిక విభాగాలకు సంబంధించిన కార్యకలాపాలు శరవేగంతో సాగుతున్నాయి.
 కామెడీ, థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం కోసం సంగీత దర్శకుడు సుమన్ జూపూడి రూపొందించిన ఓ పాటను బుధవారం రాత్రి షూటింగ్ లొకేషన్‌లో యూనిట్ సభ్యుల మధ్య ‘ఐదర్ మోటార్స్ లిమిటెడ్’ ఎండీ శివకుమార్  ఆవిష్కరించారు.
 ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని గిన్నిస్ బుక్ మార్గదర్శకత్వ ప్రమాణాలకు అనుగుణంగా న్యాయవాది పరమేశ్వర్‌రావు పర్యవేక్షణలో వీడియో చిత్రీకరించారు.
 ఈ చిత్రంలోని కీలక హాస్య సన్నివేశాలను ‘తాగుబోతు’ రమేశ్, ‘షకలక’ శంకర్‌లపై  చిత్రీకరించి, ఎడిటింగ్, డీఐ కార్యక్రమాలు పూర్తి చేశారు.
 గురువారం షూటింగ్ కోసం హీరో, హీరోయిన్లపై చిత్రీకరించాల్సిన సన్నివేశాలకు సంబంధించిన డైలాగ్స్‌ను పూర్తి చేసుకుని చిత్రీకరణ చేపట్టారు.