నాగ్‌ సరికొత్త అనుభవం

20 Nov, 2017 10:12 IST|Sakshi

సాక్షి, సినిమా : 28 ఏళ్ల క్రితం శివ నా జీవితాన్ని మార్చేసింది. ఇప్పుడు మరో మరో చిత్రం రాబోతుంది. మాటల్లో అభివర్ణించలేనిది అనుభూతి. ప్రతీరోజూ కొత్త అనుభవాలతో జీవితం ముందుకు సాగాలని కోరుకుంటున్నా... ఇది అగ్రనటుడు నాగార్జున ఈ ఉదయం తన ట్విట్టర్‌ చేసిన ట్వీట్‌.

నాగ్‌-వర్మ కొత్త చిత్రం షూటింగ్‌ మరికాసేపట్లో ప్రారంభం కాబోతుంది. ఈ నేపథ్యంలోనే ఈ సీనియర్‌ నటుడు ఎంతో ఆత్రుతతో ఉన్నట్లు అర్థమౌతోంది. ఈ చిత్రంలో ఓ పోలీసాఫీసర్‌ పాత్రలో నటించబోతున్నట్లు ముందే చెప్పేసుకున్నాం. అందుకు తగ్గట్లు నాగ్‌ లుక్‌ కూడా ఆకట్టుకుంది. ​కాగా, గత రాత్రి సినిమా షూటింగ్‌ మొదలు అంటూ వర్మ ఓ ఫోటో ట్వీట్‌ చేశాడు. వర్మ కంపెనీ నిర్మాణం బ్యానర్‌లోనే చిత్రం నిర్మిస్తున్నాడు.  

మరిన్ని వార్తలు