ఒక్క రీజన్ చెప్పమంటున్న నాని

20 Jan, 2017 16:28 IST|Sakshi
ఒక్క రీజన్ చెప్పమంటున్న నాని

సినిమా మేకింగ్ విషయంలోనే కాదు.. ప్రమోషన్ విషయంలో కూడా తన మార్క్ స్పష్టంగా ఉండేలా జాగ్రత్త పడతాడు యంగ్ హీరో నాని. తను హీరోగా నటించిన సినిమాల పబ్లిసిటీ బాధ్యతలు కూడా తానే తీసుకునే ఈ యంగ్ హీరో త్వరలో రిలీజ్కు రెడీ అవుతున్న నేను లోకల్ సినిమాను తన సోషల్ మీడియా పేజ్లో ప్రమోట్ చేస్తున్నాడు. ఎప్పటి కప్పుడు సినిమా విశేషాలను అభిమానులతో పంచుకోవటంతో పాటు ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్లను రిలీజ్ చేస్తుంటాడు.

తాజాగా నేను లోకల్ రిలీజ్ డేట్ను రివీల్ చేస్తూ ఓ ఇంట్రస్టింగ్ వీడియోను పోస్ట్ చేశాడు నాని. ఫిబ్రవరి 3న రిలీజ్ అవుతున్న నేనులోకల్ సినిమా ప్రమోషన్లో భాగంగా క్యాలెండర్లో ఫిబ్రవరి మూడు తేదీని చూపిస్తూ.. 'సినిమా చూడటానికి ఒక్క రీజన్ చెప్పమని మీరడగొచ్చు, కానీ చూడకుండా ఉండటానికి ఒక్క రీజన్ చెప్పండి. అందుకే ఫిబ్రవరి 3న థియేటర్కి వచ్చేయండి' అంటూ వినూత్నంగా సినిమాను ప్రమోట్ చేస్తున్నాడు.

నాని సరసన కీర్తీ సురేష్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకు త్రినాథ్ రావు నక్కిన దర్శకుడు. సంక్రాంతి బరిలో శతమానం భవతి మంచి హిట్ సాధించిన దిల్ రాజు నిర్మాత. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియోకు మంచి రెస్పాన్స్ రావటంతో సినిమా మీద కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి.