మాట ఒకటై.. మనసులు ఒకటై...

22 Sep, 2018 06:18 IST|Sakshi
అనుపమా పరమేశ్వరన్, పునీత్‌రాజ్‌కుమార్‌

హీరో జర్నలిస్ట్‌. హీరోయిన్‌ లాయర్‌. ఓ సమస్యను పరిష్కరించడానికి ఇద్దరూ ఒక మాట మీద నిలబడతారు. ఈ దిశలో ఇద్దరి మనసులూ కలుస్తాయి. మరి ఈ ఇద్దరూ కలిసి క్రిమినల్‌కు ఎలా శిక్షపడేలా చేశారో తెలుసుకోవాలంటే ‘నటసార్వభౌమ’ సినిమా చూడాల్సిందే. పునీత్‌రాజ్‌కుమార్‌ హీరోగా పవన్‌ వడయార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘నటసార్వభౌమ’. ఇందులో అనుపమా పరమేశ్వరన్, రచితా రామ్‌ కథానాయికలుగా నటిస్తున్నారు.

అనుపమ లాయర్‌గా కనిపించనున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ కోల్‌కత్తాలో జరుగుతోంది. ఈ షెడ్యూల్స్‌లో పునీత్, అనుపమాలపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. అలాగే రెండు సాంగ్స్‌ను కూడా ప్లాన్‌ చేశారు చిత్రబృందం. ఈ సినిమాను ముందుగా ఈ ఏడాది దసరాకు రిలీజ్‌ చేయాలనుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల కుదర్లేదు. ఇప్పుడీ సినిమా డిసెంబర్‌లో విడుదల కానుందని వార్తలు వస్తున్నాయి.

మరిన్ని వార్తలు