క్యాన్సర్‌తో హీరో సోదరి మృతి

9 Dec, 2019 09:57 IST|Sakshi

ముంబై: బాలీవుడ్‌ విలక్షణ నటుడు నవాజుద్దీన్‌ సిద్ధిఖీ సోదరి స్యామా తామ్షీ సిద్ధిఖీ(26) మృతి చెందారు. గత కొద్ది కాలంగా క్యాన్సర్‌తో పోరాడుతున్న ఆమె శనివారం మరణించినట్లు సిద్ధిఖీ కుటుంబ సభ్యులు తెలిపారు. కాగా పద్దెమినిదేళ్ల వయస్సులోనే స్యామా బ్రెస్ట్‌ క్యాన్సర్‌ బారిన పడిన విషయాన్ని నవాజుద్దీన్ గతేడాది సోషల్‌ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. స్యామా 25వ పుట్టినరోజు సందర్భంగా... చిన్న వయస్సు నుంచే తన చిట్టి చెల్లెలు చావుతో ధైర్యంగా పోరాడుతోందని చెప్పుకొచ్చాడు. ఈ సందర్భంగా దాదాపు ఏడేళ్లుగా స్యామాకు చికిత్స చేస్తున్న డాక్టర్లకు కృతఙ్ఞతలు తెలిపాడు. ప్రస్తుతం ఆమె మరణంతో నవాజుద్దీన్‌తో పాటు అతడి కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

ఇక స్యామా అంత్యక్రియలు సిద్ధిఖీ కుటుంబ స్వగ్రామమైన బుధానా(ఉత్తరప్రదేశ్‌)లో ఆదివారం నిర్వహించినట్లు సమాచారం. కాగా నవాజుద్దీన్‌ ఇటీవల ‘మోతీచూర్‌ చక్నాచూర్‌’ సినిమాలో హీరోగా నటించిన సంగతి తెలిసిందే. అదే విధంగా నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారమయ్యే సాక్రెడ్ గేమ్స్‌, యూకే సిరీస్‌ మెక్‌మాఫియా యూనిట్‌ తరఫున గత నెలలో జరిగిన ఎమ్మీ అవార్డుల ప్రదానోత్సవానికి హాజరయ్యాడు. ప్రస్తుతం.. బంగ్లాదేశీ ఫిల్మ్‌మేకర్‌ సర్వార్‌ ఫరూఖీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘నో ల్యాండ్స్‌ మ్యాన్‌’ షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. ఈ క్రమంలో అమెరికాలో షూటింగ్‌ జరుగుతుండగానే చెల్లెలి మృతి విషయం తెలియడంతో ఇండియాకు వచ్చినట్లు సమాచారం.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

‘ప్రతిరోజూ పండుగే’ ప్రమోషన్‌లో గొడవ

బాలీవుడ్‌లోనే ఆదరణ!

కమల్‌ పోస్టర్లపై పేడ వేశాను

చిరు ఫ్యాన్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడి మృతి

సినిమాల పైరసీ నేపథ్యంలో.. 

కథా బలం ఉన్న సినిమాలు హిట్టే

రెండు జంటలు

మహిళల స్వేచ్ఛ కోసం.. 

కొత్త నిర్మాతలు లేకుంటే మనుగడ లేదు – సి.కల్యాణ్‌ 

భయపెడతా 

సినీ చరిత్రను పరిరక్షించుకోవాలి 

శంకర్‌ తర్వాత మురుగదాస్‌ : రజనీకాంత్‌

ఈ మామకు ఇంకేం కావాలి : వెంకటేష్‌

‘సోనాక్షి సల్మాన్‌ ఖాన్‌ చెంచా!’

రూ.40కే సినిమాను అమ్మేస్తారా అంటూ హీరో ఆవేదన

రెట్టింపైన క్రేజ్‌; రాహుల్‌కు అవార్డు

వర్మకు సెన్సార్‌ సర్టిఫికెట్‌ ఇచ్చిన కేఏ పాల్‌

వర్మ ఇలా మారిపోయాడేంటి?

బన్నీ అప్‌డేట్‌ వాయిదా.. ఎందుకంటే..

ఎన్‌కౌంటర్‌పై ఉపేంద్ర వ్యాఖ్యలు.. నెటిజన్ల ఫైర్‌

దుమ్ములేపిన బాలయ్య.. రూలర్‌ ట్రైలర్‌ రిలీజ్‌

ఖమ్మంలో ‘వెంకీ మామ’

ఖుషీ ఖుషీ స్టెప్స్‌

డేట్‌ ఫిక్స్‌

అపజయం మంచికే!

శుక్రవారం మూడు మ్యాచ్‌లు గెలిచాయి

అతి నిద్ర అనారోగ్యం

సేఫ్‌ జానర్‌లో వెళ్లాలనుకోను

తెలుగు సినిమాల్లో రీకన్‌స్ట్రక్షన్‌ను చూద్దామా!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

క్యాన్సర్‌తో హీరో సోదరి మృతి

‘ప్రతిరోజూ పండుగే’ ప్రమోషన్‌లో గొడవ

బాలీవుడ్‌లోనే ఆదరణ!

కమల్‌ పోస్టర్లపై పేడ వేశాను

చిరు ఫ్యాన్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడి మృతి

కథా బలం ఉన్న సినిమాలు హిట్టే