డబుల్‌ ధమాకా

30 Jul, 2018 04:30 IST|Sakshi
నయనతార

అభిమానులు తమ ఫేవరెట్‌ యాక్టర్స్‌ని స్క్రీన్‌పై తరచూ చూడాలనుకుంటారు. కానీ ఒక్కో సినిమాకు నాలుగైదు నెలలు గ్యాప్‌ వస్తుంది. కొన్ని సార్లు సంవత్సరం కూడా పట్టొచ్చు. ఒకే నెలలో రెండు సార్లు తమ అభిమాన యాక్టర్‌ను థియేటర్స్‌లో చూసే చాన్స్‌ వస్తే? అది ఖచ్చితంగా డబుల్‌ ధమాకానే. నయనతార తన  అభిమానులకు ఒకే నెలలో కనిపించి డబుల్‌ ధమాకా ఇవ్వనున్నారు. ఆగస్ట్‌ నెలలో రెండుసార్లు స్క్రీన్‌ పై కనిపించి అభిమానులను ఖుషీ చేయనున్నారామె.

నయనతార ముఖ్య పాత్రలో కొత్త దర్శకుడు నెల్సన్‌ రూపొందించిన చిత్రం ‘కోకో (కోలమావు కోకిల). ఈ లేడీ ఓరియంటెడ్‌ సినిమాను ఆగస్ట్‌ 17న విడుదల చేయడానికి ప్లాన్‌ చేశారు. అలాగే రాశీ ఖన్నా, అనురాగ్‌ కశ్యప్‌ ముఖ్య పాత్రల్లో కనిపించనున్న థ్రిల్లర్‌ మూవీ   ‘ఇమైక్క నొడిగళ్‌’ని ఆగస్ట్‌ 24న రిలీజ్‌ చేస్తున్నట్టు చిత్రబృందం అనౌన్స్‌ చేసింది. సో.. ఒకే నెలలో, అది కూడా పదిహేను రోజుల గ్యాప్‌లో రెండు సార్లు నయనతార కనిపించనున్నారన్నమాట. నయన ఫ్యాన్స్‌కు ఇది డబుల్‌ ధమాకా అని చెప్పొచ్చు.

మరిన్ని వార్తలు