-
పవర్ ఫుల్ రాంగీ
‘రాంగీ’ అనే తమిళ లేడీ ఓరియంటెడ్ సినిమాలో ఫుల్ యాక్షన్ మోడ్‌లో త్రిష కనిపించనున్నారని తెలిసింది. ఈ సినిమాలో స్టంట్స్ అన్నీ స్వయంగా త్రిషానే చేస్తున్నారు. అది మాత్రమే కాదు.. ఈ సినిమా కోసం బులెట్ నడపడం కూడా నేర్చుకున్నారట. యం. శరవణన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా కొత్త షెడ్యూల్ ఉజ్బెకిస్తాన్‌లో జరగనుంది. 15 రోజుల పాటు సాగే ఈ షెడ్యూల్లో ఎక్కువ యాక్షన్ సన్నివేశాలనే చిత్రీకరించడానికి ప్లాన్ చేశారట. ఈ ఏడాది చివర్లో సినిమా రిలీజ్ కానుంది. -
డబుల్ ధమాకా
అభిమానులు తమ ఫేవరెట్ యాక్టర్స్‌ని స్క్రీన్‌పై తరచూ చూడాలనుకుంటారు. కానీ ఒక్కో సినిమాకు నాలుగైదు నెలలు గ్యాప్ వస్తుంది. కొన్ని సార్లు సంవత్సరం కూడా పట్టొచ్చు. ఒకే నెలలో రెండు సార్లు తమ అభిమాన యాక్టర్‌ను థియేటర్స్‌లో చూసే చాన్స్ వస్తే? అది ఖచ్చితంగా డబుల్ ధమాకానే. నయనతార తన అభిమానులకు ఒకే నెలలో కనిపించి డబుల్ ధమాకా ఇవ్వనున్నారు. ఆగస్ట్ నెలలో రెండుసార్లు స్క్రీన్ పై కనిపించి అభిమానులను ఖుషీ చేయనున్నారామె. నయనతార ముఖ్య పాత్రలో కొత్త దర్శకుడు నెల్సన్ రూపొందించిన చిత్రం ‘కోకో (కోలమావు కోకిల). ఈ లేడీ ఓరియంటెడ్ సినిమాను ఆగస్ట్ 17న విడుదల చేయడానికి ప్లాన్ చేశారు. అలాగే రాశీ ఖన్నా, అనురాగ్ కశ్యప్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్న థ్రిల్లర్ మూవీ ‘ఇమైక్క నొడిగళ్’ని ఆగస్ట్ 24న రిలీజ్ చేస్తున్నట్టు చిత్రబృందం అనౌన్స్ చేసింది. సో.. ఒకే నెలలో, అది కూడా పదిహేను రోజుల గ్యాప్‌లో రెండు సార్లు నయనతార కనిపించనున్నారన్నమాట. నయన ఫ్యాన్స్‌కు ఇది డబుల్ ధమాకా అని చెప్పొచ్చు. -
చూడు... రెండో వైపు చూడు!
అనుష్క.. నయనతార.. త్రిష.. తమన్నా.. అంజలి.. పూర్ణ.. ఏంటీ? వీళ్లందరూ కలసి ఒక సినిమాలో యాక్ట్ చేయబోతున్నారేమో అనుకుంటున్నారా? అదేం కాదు. ఒకవైపు గ్లామరస్ రోల్స్ చేయడంతో పాటు వీళ్లంతా లేడీ ఓరియంటెడ్ సినిమాలతోనూ తమ సత్తా చాటారు. ఈ లిస్టులోకి తాజాగా కాజల్ అగర్వాల్ చేరారని చెన్నై టాక్. ‘చంద్రముఖి’ ఫేమ్ పి. వాసు తమిళ, తెలుగు భాషల్లో ఓ లేడీ ఓరియంటెడ్ సినిమా తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారట. ఈ సినిమాకు కాజల్ అగర్వాల్ అయితే బాగుంటుందనుకున్నారట. కాజల్‌ను కలిసి కథ వినిపించారని కోలీవుడ్ సమాచారం. లేడీ ఓరియంటెడ్ మూవీ, అది కూడా వాసులాంటి సీనియర్ డైరెక్టర్.. మరి కాజల్ కాదంటారా? గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారని భోగట్టా. ఈ బ్యూటీ కథానాయిక అయి పదేళ్లకు పైనే అయింది. ఇన్నేళ్లూ ఒకవైపు చూశాం.. ఇప్పుడు కథానాయికగా రెండో వైపు చూడనున్నాం అన్నమాట.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
No Headline
నేను పక్కా లోకల్..
No Headline
వైఎస్ జగన్ కోసం రెండు నెలలుగా ప్రార్థనలు
ప్రజల మధ్య వైరుధ్యాలు పెంచుతున్న రాహుల్
పోలింగ్ సరళిని నిశితంగా పరిశీలించాలి
ప్రజాస్వామ్యాన్నిపరిరక్షించుకోవాలి
పోలింగ్ రోజున ‘ర్యాపిడో’ ఉచిత సేవలు
వడివడిగా ఈవీఎం కమిషనింగ్ పనులు
గౌడ అభ్యర్థులను గెలిపించండి
తప్పక చదవండి
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- తెలంగాణ: రైతుబంధుకు ‘ఈసీ’ బ్రేక్
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
- ‘చార్ సౌ పార్’ ఎందుకంటే... క్లారిటీ ఇచ్చిన ప్రధాని
- దేశంలో పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే?
- PK: అన్నయ్య ప్రచారం చేస్తే తప్ప గెలవలేడా?
- రోహిత్‌కు ఇంగ్లిష్ రాదు.. ఏడిపించేవాళ్లం.. కానీ: యువీ
- తుప్పు పట్టిన సైకిల్లో మిగిలింది బెల్ మాత్రమే: సీఎం జగన్
Advertisement