'లై' టీజర్ వచ్చేస్తోంది

9 Jul, 2017 12:52 IST|Sakshi
'లై' టీజర్ వచ్చేస్తోంది

అ..ఆ.. సినిమాతో 50 కోట్ల క్లబ్లో స్థానం సంపాదించుకున్న యంగ్ హీరో నితిన్, ఆ రేంజ్ కాపాడుకునేందుకు కష్టపడుతున్నాడు. అందుకే కాస్త గ్యాప్ తీసుకొని ఓ డిఫరెంట్ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. అందాల రాక్షసీ, కృష్ణగాడి వీర ప్రేమగాథ లాంటి సినిమాలతో దర్శకుడిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హను రాఘవపూడి దర్శకత్వంలో లై సినిమాలో నటిస్తున్నాడు.

14 రీల్స్ బ్యానర్పై తెరకెక్కుతున్న ఈ  సినిమాలో యాక్షన్ హీరో అర్జున్ ప్రతినాయక పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్తో సినిమా మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఆ అంచనాలను మరింత పెంచేందుకు రెడీ అవుతోంది చిత్రయూనిట్. ఈ సోమవారం హీరో విలన్ల మధ్య వచ్చే ఆసక్తికర సన్నివేశానికి సంబంధించిన పోస్టర్ను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు. మంగళవారం లై ఫస్ట్ టీజర్ను రిలీజ్ చేయనున్నారు.