షాంగై అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో పేరంబు

18 May, 2018 07:40 IST|Sakshi
పేరంబు చిత్రంలో ఓ దృశ్యం

తమిళసినిమా: పేరంబు చిత్రం షాంగై అంతర్జాతీయ చిత్రోత్సవాలకు ఎంపికైంది. మలయాళ సూపర్‌స్టార్‌ మమ్ముట్టి, అంజలి జంటగా నటిం చిన ద్విభాషా (తమిళం, మలయాళం) చిత్రం పెరంబు. తరమణి చిత్రం తరువాత వైవిధ్య భరిత కథా చిత్రాల దర్శకుడు రామ్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని పీఎల్‌.తేనప్పన్‌ నిర్మించారు. ఈ చిత్రం జనవరిలో జరిగిన 47వ రోటర్‌డమ్‌ అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో ప్రదర్శింపబడింది. ప్రపంచంలోని వివిధ భాషలకు చెందిన  187 చిత్రాల్లో ఎంపికైన 20 చిత్రాల్లో ప్రేక్షకుల విభాగంలో అవార్డుకు ఎంపికైన ఏకైక చిత్రం పేరంబు. అదేవిధంగా నెట్‌పాక్‌ అవార్డును గెలు చుకున్న పేరంబు చిత్రం జూన్‌ 16 నుంచి 25వ తేదీ వరకూ చైనాలోని షాంగై నగరంలో జరగనున్న  21వ షాంగై అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో ప్రదర్శంపబడనుంది. ఈ చిత్రాన్ని ప్రపంచ ప్రదర్శన తరువాత విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు నిర్మాతల వర్గం తెలిపారు. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు