ఈ నెల 16న నిర్భయకి న్యాయం జరగబోతోంది: పూనమ్‌

9 Dec, 2019 21:40 IST|Sakshi

న్యూఢిల్లీ: సోషల్ మీడియాలో తనదైన శైలిలో పదునైన కామెంట్స్ చేస్తూ ఎంతో యాక్టివ్‌గా ఉండే సినీ నటి పూనమ్ కౌర్ సామాజిక అంశాలపై తనదైన శైలింలో గళం వినిపిస్తుంటారు. ఎప్పటికప్పుడు ఆడవాళ్లపై జరుగుతున్న అక్రమాలపై ట్వీట్‌ల రూపంలో గళం విప్పుతుంటారు. తాజాగా.. ఆమె ఢిల్లీలో నిర్భయ తల్లి ఆశాదేవిని కలుసుకోవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఆమెకు ఓ రెస్టారెంట్ లో చిన్న విందు కూడా ఇచ్చారు. అంతేగాక ఆశాదేవి భుజాలపై ఆప్యాయంగా చేతులు వేసిన ఓ ఫొటోను పూనమ్ కౌర్ తన ట్విటర్‌లో పోస్ట్ చేశారు. ఈ నెల 16న నిర్భయకు న్యాయం జరగబోతోంది. ఆ రోజున యావత్ భారతదేశం ఎంతో సంతోషంగా ఉంటుంది. చాలా కాలం పాటు ఎదురుచూశాం. నిర్భయ నిందితులకు ఉరిశిక్ష పడుతుందని తెలిసి మన దేశం ఎంతో సంతోషిస్తోంది అంటూ తన ట్విటర్‌ ఖాతాలో పేర్కొంది.

చదవండి: ఆ మృగాలని చంపి నేను జైలుకెళ్తా: పూనంకౌర్‌

మరిన్ని వార్తలు