సునాయాసంగా రిస్కీ ఫైట్స్

3 Oct, 2013 01:26 IST|Sakshi
సునాయాసంగా రిస్కీ ఫైట్స్
కథానాయిక ప్రాధాన్యం ఉన్న చిత్రాల్లో నటించడం ప్రియమణికి కొత్త కాదు. ఆ తరహావి ఇప్పటివరకు మూడు, నాలుగు చేసేశారు. ఇప్పుడు ‘చండీ’లో నటించారు. ప్రియమణి గత చిత్రాలకు ఈ చిత్రానికి ఉన్న తేడా ఏంటంటే.. ఇది పూర్తి స్థాయి యాక్షన్ ఓరియంటెడ్ మూవీ. ఇందులో ప్రియమణి వీరోచితమైన పోరాటాలు చేశారు.
 
 కీలక పాత్రల్లో కృష్ణంరాజు, శరత్‌కుమార్ నటించిన ఈ చిత్రానికి సముద్ర దర్శకుడు.  జి. జగన్నాథనాయుడు సమర్పణలో డా. శ్రీనుబాబు .జి నిర్మించారు. ఈ నెల మొదటి వారంలోనే ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకున్నారు. కానీ, సాంకేతిక కారణాల వల్ల విడుదలను వాయిదా వేశామని నిర్మాత తెలిపారు. దర్శకుడు మాట్లాడుతూ -‘‘ఈ సినిమాకి కథే హీరో. 
 
 కృష్ణంరాజుగారు నటించడం ఆనందంగా ఉంది. ఆయన కూతురి పాత్రను ప్రియమణి చేశారు. రిస్కీ ఫైట్స్‌ని సైతం సునాయాసంగా చేశారామె. ఈ చిత్రానికి కృష్ణంరాజు, శరత్‌కుమార్ పాత్రలు ఎస్సెట్‌గా నిలుస్తాయి. ప్రియమణి నటన ఓ హైలైట్ అవుతుంది. అన్ని వర్గాలవారు చూడదగ్గ చిత్రం ఇది’’ అని చెప్పారు. ఈ చిత్రానికి సహనిర్మాత: సత్య ముమ్మిడి.