గీత స్మరణం | Sakshi
Sakshi News home page

గీత స్మరణం

Published Thu, Oct 3 2013 1:24 AM

గీత స్మరణం

 పల్లవి :
 
 అతడు: నేనెప్పుడైనా అనుకున్నానా
   కనురెప్ప మూసి కలగన్నానా
 పెను ఉప్పెనల్లే ఎద ఉప్పొంగేనని ప్రేమలో
 ఆమె: గువ్వంత గుండెలో ఇన్నాళ్లు
 రవ్వంత సవ్వడి రాలేదు
 మువ్వంత సందడిగా అలజడి రేగే ఎందుకో
 బృందం: కనులు కనులు కలిసే
 కలలే అలలై ఎగసే
 మనసు మనసు మురిసే
 మధువై పెదవే తడిసే
 తెరలే తొడిగే సొగసే
 
 కురులే విరులై విరిసే
 ॥
 

 చరణం : 1
 
 ఆ: ఓ... కన్నె కస్తూరినంత నేనై
 వన్నె ముస్తాబు చేసుకోనా
 చేరే నీకు కాశ్మీరాలా చలే పంచనా
 అ: ఇంటికింపైన రూపు నీవే
 కంటిరెప్పైన వేయనీవే
 ఆ: నిండు కౌగిళ్లలో రెండు నా కళ్లలో
   నిన్ను నూరేళ్లు బంధించనా
 ॥॥
 

 చరణం : 2
 
 ఆ: ఓ... మల్లెపూదారులన్నీ నీవై
 మంచు పన్నీరులన్నీ నేనై
 వసంతాల వలసే పోదా సుఖాంతాలకే
 అ: జంట సందేళలన్నీ నేనై
 కొంటె సయ్యాటలన్నీ నీవై
 ఆ: నువ్వు నాలోకమై నేను నీ మైకమై
   ఏకమౌదాము ఈనాడిలా
 ॥

 
 చిత్రం : రామయ్యా వస్తావయ్యా (2013)
 రచన : సాహితి
 సంగీతం : ఎస్.ఎస్.థమన్
 గానం : శంకర్ మహదేవన్, శ్రేయాఘోషల్, బృందం

 
 - నిర్వహణ: నాగేష్
 

Advertisement
Advertisement