కొత్త కొత్తగా...

12 Oct, 2019 00:53 IST|Sakshi
క్లాప్‌ ఇస్తున్న భానుచందర్‌

సుజియ్, మధుప్రియ, నాగేంద్ర సి.హెచ్, వెంకట్‌ ప్రధాన తారలుగా ఓ చిత్రం ప్రారంభమైంది. రాజశేఖర్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రియాంక ఆర్ట్‌ క్రియేషన్స్‌ పతాకంపై ప్రొడక్షన్‌ నెం.1గా డా.పర్వతరెడ్డి, నవీన్‌ కుమార్‌రెడ్డి, సనారెడ్డి, జనార్ధన్‌రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి తెలుగు ఫిలించాంబర్‌ ప్రొడ్యూసర్‌ కౌన్సిల్‌ ఉపాధ్యక్షుడు సాయివెంకట్‌ కెమెరా స్విచ్చాన్‌ చేయగా, నటుడు భానుచందర్‌ క్లాప్‌ ఇచ్చారు. డైరెక్టర్‌ వీరభద్రం చౌదరి గౌరవ దర్శకత్వం వహించారు. ‘‘ఇటీవల వస్తున్న సినిమాలకు భిన్నంగా కొత్త కథతో మా సినిమా ఉంటుంది’’ అని చిత్రబృందం పేర్కొంది. లక్ష్మీ పిక్చర్స్‌ అధినేత బాపిరాజు, నిర్మాత శేఖర్‌రెడ్డి, డైరెక్టర్‌ బి. వేణు, హైకోర్టు న్యాయవాది లక్ష్మీపతి, శ్రీనివాస్‌గౌడ్, మురళి తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: కిట్టు, సంగీతం: ఉదయ్‌కిరణ్‌.

మరిన్ని వార్తలు