పెళ్లి కోసమేనా?

28 Jul, 2018 01:59 IST|Sakshi
నిక్‌ జోనాస్‌, ప్రియాంకా చోప్రా

ఇవ్వక ఇవ్వక రెండేళ్ల తర్వాత ప్రియాంకా చోప్రా బాలీవుడ్‌లో ‘భారత్‌’ సినిమా చేయడానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. దాంతో ఆమె అభిమానులు ఆనందపడ్డారు. ఇప్పుడు ఆ సినిమా నుంచి ఆమె తప్పుకున్నారని తెలిసి రెట్టింపు ఆనందపడుతున్నారు. ప్రియాంక సినిమా చేయకపోతే హ్యాపీ ఫీలవ్వాల్సిన అవసరం ఏంటీ? అంటే.. ఓ స్పెషల్‌ రీజన్‌ ఉంది. ‘భారత్‌’ సినిమా డేట్స్‌ను క్యాన్సిల్‌ చేసిన ప్రియాంకా, పెళ్లికి డేట్స్‌ ఇచ్చారని బాలీవుడ్‌ టాక్‌. సల్మాన్‌ఖాన్‌ హీరోగా అలీ అబ్బాస్‌ జాఫర్‌ దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా ‘భారత్‌’. ఈ సినిమా నుంచి సడన్‌గా ప్రియాంక తప్పుకున్నారు.

ఈ విషయంపై దర్శకుడు జాఫర్‌ క్లారిటీ ఇస్తూ– ‘‘అవును..‘భారత్‌’ సినిమాలో ప్రియాంకా చోప్రా నటించడం లేదు. ఈ నిర్ణయాన్ని ఆమె నిక్‌ ఆఫ్‌ టైమ్‌ (చివరి నిమిషం) లో చెప్పారు. హ్యాపీ లైఫ్‌ని ప్రియాంక గడపాలని ‘భారత్‌’ టీమ్‌ కోరుకుంటోంది’’ అని పేర్కొన్నారు. ప్రియాంక బాయ్‌ఫ్రెండ్‌ నిక్‌ జోనాస్‌ పేరు వచ్చేట్లు ‘నిక్‌ ఆఫ్‌ టైమ్‌’ అని దర్శకుడు జాఫర్‌ ప్రస్తావించడంతో.. నిక్‌తో ప్రియాంక పెళ్లికి రెడీ అయిట్లు ఆయన హింటు ఇచ్చినట్లుగా కొందరు భావిస్తున్నారు. ఇదిలా ఉంటే సోనాలి బోస్‌ దర్శకత్వంలో రూపొందనున్న ‘ద స్కై ఈజ్‌ పింక్‌’ సినిమాను కూడా ప్రియాంక ఒప్పుకున్నారు. మరి ఈ సినిమాలో నటించే విషయం గురించి కూడా ప్రియాంక ఏమైనా షాక్‌ ఇస్తారా? వెయిట్‌ అండ్‌ సీ.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా