జూన్‌ నుంచి రోలింగ్‌

25 Mar, 2019 00:06 IST|Sakshi
రానా

పీరియాడికల్‌ చిత్రాలు, ప్యాన్‌ ఇండియా చిత్రాలపై రానా ఎక్కువ శ్రద్ధ పెడుతున్నారన్న సంగతి ఆయన సినిమాల ఎంపిక విషయాన్ని చూసి గమనించవచ్చు. ‘హాధీమేరీ సాథీ, 1945’ వంటి బహుబాషా చిత్రాలతోప్రస్తుతం బిజీగా ఉన్నారు రానా. ఇది వరకే అంగీకరించిన ‘హిరణ్యకశిప’ చిత్రాన్ని జూన్‌ నుంచి సెట్స్‌ మీదకు తీసుకెళ్లనున్నారట. గుణశేఖర్‌ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రాన్ని సుమారు 180 కోట్ల బడ్జెట్‌తో సురేశ్‌బాబు నిర్మించనున్నారు. ప్రీ ప్రొడక్షన్‌ పనులు పూర్తి కావచ్చాయని సమాచారం. ఈ చిత్ర వీఎఫ్‌ఎక్స్‌కు సుమారు 17 వీఎఫ్‌ఎక్స్‌ స్టూడియోలు పని చేయనున్నాయి. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ  చిత్రం రిలీజ్‌ కానుంది.

మరిన్ని వార్తలు