అంచనాలు పెంచేస్తున్న ‘2.ఓ’ స్టిల్స్‌

16 Nov, 2018 20:25 IST|Sakshi

ఇండియన్‌ సిల్వర్ స్ర్కీన్‌ను షేక్‌ చేయడానికి రజనీకాంత్‌ ‘2.ఓ’ సిద్దమైంది. స్టార్‌ డైరెక్టర్‌ శంకర్‌ హాలీవుడ్‌ స్థాయిలో సృషించిన ఈ విజువల్‌ వండర్‌ ఈ నెల 29న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్‌ చేయడానికి సన్నాహాలు ప్రారంభమయ్యాయి. అక్షయ్‌కుమార్‌ నెగటీవ్‌ రోల్‌లో నటిస్టున్న ఈ చిత్రంలో రజనీ సరసన అమీజాక్సన్‌ నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా ఏ రేంజ్‌లో ఉండబోతుందో టీజర్‌, ట్రైలర్‌ రూపంలో చిత్ర యునిట్‌ అభిమానులకు రుచి చూపించిన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాపై మరింత హైప్‌ క్రియేట్‌ చేయడానికి చిత్ర బృందం సినిమాకు సంబంధించిన స్టిల్స్‌ను షేర్‌ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట్లో తెగ హల్‌చల్‌ చేస్తున్నాయి.  

ఆ లుక్‌ వెనుక ఇంత శ్రమనా..
ఇప్పటికే విడుదలైన టీజర్‌, ట్రైలర్‌లో అక్షయ్‌ కుమార్‌ రాక్షస రూపంలో అందరినీ భయపెట్టే ప్రయత్నం చేశాడు. అయితే అక్షయ్‌ లుక్స్‌ అన్నీ గ్రాఫిక్స్‌ ద్వారా క్రియేట్‌ చేశారని రూమర్స్‌ వస్తున్న తరుణంలో అక్షయ్‌ కుమార్‌ ఓ వీడియోను షేర్‌ చేశారు. ఇది కేవలం టెక్నికల్‌ వండర్‌ మాత్రమే కాదు, దీని వెనుక ఎంతో శ్రమ దాగి ఉందని ఆయన తెలిపారు. ఇక ఆ వీడియోలో మేకప్‌ బృందం, టెక్నీషియన్స్‌ గంటల తరబడి శ్రమించి అక్షయ్‌కు ఆ లుక్‌ను తీసుకొచ్చారు. అక్షయ్‌ షేర్‌ చేసిన మేకింగ్‌ వీడియో తెగ వైరల్‌ అవుతోంది.  

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు