మల్టీస్టారర్‌?

17 Sep, 2018 02:29 IST|Sakshi
రామ్,దుల్కర్‌ సల్మాన్‌

ఫస్ట్‌ సినిమా ‘ఆర్‌ఎక్స్‌ 100’తో సక్సెస్‌ అందుకున్నారు దర్శకుడు అజయ్‌ భూపతి. బాక్సాఫీస్‌ వద్ద కూడా ఈ బండి బాగానే సౌండ్‌ చేసిన సంగతి తెలిసిందే. తన నెక్ట్స్‌ ప్రాజెక్ట్‌గా మల్టీస్టారర్‌ చేస్తున్నట్టు ఆ మధ్య ‘సాక్షి’కి తెలిపారు అజయ్‌ భూపతి. లేటెస్ట్‌గా వినిపిస్తున్న సమాచారమేంటంటే ఈ మల్టీస్టారర్‌లో ఎనర్జిటిక్‌ హీరో రామ్, ‘మహానటి’తో తెలుగు ఆడియన్స్‌కు దగ్గరైన మలయాళ హీరో దుల్కర్‌ సల్మాన్‌ హీరోలుగా కనిపిస్తారట. ఈ ప్రాజెక్ట్‌ను ‘స్రవంతి’ రవికిశోర్‌ నిర్మించనున్నారు. ఇద్దరు భిన్న మనస్తత్వాలు కలిగి ఉన్న మనుషుల మధ్య జరిగే కథలా ఈ చిత్రం ఉండబోతోందని, అలాగే ఫస్ట్‌ సినిమాలానే రియలిస్టిక్‌గానే ఉంటుందని కూడా దర్శకుడు ఓ సందర్భంలో పేర్కొన్నారు. ప్రస్తుతం స్క్రిప్ట్‌ వర్క్‌ జరుగుతున్న ఈ చిత్రం ఈ ఏడాది చివర్లో సెట్స్‌ మీదకు వెళ్లనుందని సమాచారం.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా