టూ క్యూట్‌ అంటున్న ఉపాసన

6 May, 2018 10:12 IST|Sakshi

టాలీవుడ్‌ అగ్ర హీరోల మధ్య స్నేహం బాగా పెరుగుతుంది. ఇటీవలి కాలంలో ఒక హీరో ఆడియో ఫంక్షన్‌లకు మరొకరు హాజరవ్వడం, బయట పార్టీల్లో సందడి చేయడం, ఇతర హీరోల సినిమాలపై సోషల్‌ మీడియా వేదికగా ప్రశంసలు కురిపించడం చూస్తూనే ఉన్నాం. రంగస్థలం బ్లాక్‌ బాస్టర్‌గా నిలిచిన నేపథ్యంలో ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. భరత్‌ అనే నేను చిత్ర నిర్మాత ఏర్పాటు చేసిన  పార్టీలో ప్రిన్స్‌ మహేశ్‌ బాబు, మెగా హీరో రామ్‌ చరణ్‌, యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌లు కలిసి సందడి చేసిన సంగతి తెలిసిందే. తాజాగా తమ మధ్యే కాదు తమ కుటుంబాల మధ్య కూడా స్నేహపూర్వక వాతావరణం ఉందనేలా చెర్రీ దంపతులు, ఎన్టీఆర్‌ ఇంట్లో సందడి చేశారు.

శనివారం ఎన్టీఆర్‌, ప్రణతి దంపతుల పెళ్లి రోజు వేడుకకు(మే 5న) చెర్రీ దంపతులు హాజరయ్యారు. ఎన్టీఆర్‌ దంపతులతో కేక్‌ కట్‌ చెయించారు. అలాగే ఎన్టీఆర్‌ తనయుడు అభయ్‌ రామ్‌తో సరదాగా గడిపారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఉపాసన ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. అంతే కాకుండా అభయ్‌ రామ్‌ బుజ్జి బుజ్జిగా ‘ఐ వనా ఫాలో ఫాలో యూ’  అంటూ తన తండ్రి చిత్రంలోని పాటను పాడుతున్న వీడియోను కూడా ఉపాసన అభిమానులతో పంచుకున్నారు. చెర్రీ, ఎన్టీఆర్‌ అభిమానులు ఈ ఫొటో తెగ షేర్‌ చేస్తూ సంబరపడిపోతున్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు