‘వీవీఆర్‌’ ఎంత రికవరీ చేసిందంటే..?

17 Jan, 2019 20:00 IST|Sakshi

సంక్రాంతి విన్నర్‌ అవుదామని పందెంకోడిలా బరిలోకి దిగిన మెగా పవర్‌స్టార్‌ రామ్‌ చరణ్‌కు ఎదురుదెబ్బ తగిలింది. మాస్‌.. ఊర మాస్‌, కమర్షియల్‌ మూవీ అంటూ ఊదరగొట్టిన ఈ చిత్రానికి విపరీతమైన నెగెటివ్‌ టాక్‌ వచ్చింది. యాక్షన్‌ సన్నివేశాలపై సోషల్‌మీడియాలో ఓ రేంజ్‌లో ట్రోలింగ్స్‌ వచ్చాయి. అయితే మొదటిరోజే ఈ సినిమాపై వచ్చిన టాక్‌ చూసి.. రెండో రోజుకు ఈ మూవీ చాపచుట్టేస్తుందని అంతా భావించారు. 

కానీ అనూహ్యంగా వినయ విధేయ రామ నిలకడగా రన్‌అవుతోంది. సంక్రాంతి విన్నర్‌గా నిలిచిన ఎఫ్‌2పై కాసుల వర్షం కురుస్తున్నా.. కలెక్షన్ల విషయంలో వీవీఆరే ముందుంది. ఇప్పటివరకు ఈ సినిమా దాదాపు 65 శాతాన్ని రికవరీ చేసినట్టు తెలుస్తోంది. అయితే రామ్‌ చరణ్‌ రంగస్థలం తరువాత వస్తోన్న చిత్రం, మాస్‌ డైరెక్టర్‌ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో అనేసరికి ఈ మూవీ బిజినెస్‌ ఓ రేంజ్‌లో జరిగింది. రంగస్థలం రికార్డులు కూడా బద్దలు కొట్టేస్తుందని అభిమానులు ఆశపడ్డారు. 

తీరా ఫలితం చూస్తే.. రంగస్థలం రికార్డులు దేవుడెరుగు కనీసం పెట్టిన పెట్టుబడి వెనక్కి వస్తే చాలనుకుంటూ డిస్ట్రిబ్యూటర్లు తమ గోడును వెల్లిబుచ్చుకుంటున్నారట. ఈ సినిమాను దాదాపు 72కోట్లకు అమ్మగా ఇప్పటివరకు డిస్ట్రిబ్యూటర్లకు 46కోట్ల ఆదాయం తెచ్చిపెట్టిందట. ఇక ఓవర్సీస్‌లో అయితే పరిస్థితి మరీ దారుణంగా పడిపోయింది. ఇప్పటివరకు ఈ చిత్రం మిలియన్‌ క్లబ్‌లోకి చేరుకోలేకపోయింది. రంగస్థలంతో మూడు మిలియన్‌ డాలర్లకు పైగా వసూళ్లు చేసిన చెర్రీ.. ‘వీవీఆర్‌’తో తేలిపోయాడు. మరి వీవీఆర్‌ ఫుల్‌రన్‌లో అయినా సేఫ్‌గా బయటపడుతుందో లేదో చూడాలి. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు