‘దిల్‌’తో రామ్‌ హై

29 Oct, 2017 01:00 IST|Sakshi

‘దిల్‌తో పాగల్‌ హై’ కదా... ‘దిల్‌తో రామ్‌ హై’ అంటారేంటి? వాట్‌ అమ్మా... వాటీజ్‌ దిస్‌ అమ్మా! తప్పుగా రాశారమ్మా! అనుకుంటున్నారా? అదేం లేదు. మీరు చదివిందీ... అక్కడ రాసిందీ... కరెక్టే! ‘దిల్‌’ అంటే శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ అధినేత ‘దిల్‌’ రాజు. త్వరలో ఈయన నిర్మాణంలో రామ్‌ ఓ సిన్మా చేయనున్నారు. ‘నేను లోకల్‌’ ఫేమ్‌ త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది.

మాస్‌ అండ్‌ ఎనర్జిటిక్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ సిన్మాను తీయాలనుకుంటున్నారట! యాక్చువల్లీ... రామ్‌ హీరోగా అనిల్‌ రావిపూడి దర్శకుడిగా ‘దిల్‌’ రాజు నిర్మాణంలో ఓ సినిమా డిస్కషన్స్‌లో ఉందని గతంలో వార్తలొచ్చాయి. తర్వాత అదే కాన్సెప్టుతో రవితేజ హీరోగా ‘రాజా... ది గ్రేట్‌’ వచ్చింది. ఇప్పుడు రామ్‌–‘దిల్‌’ రాజు కాంబినేషన్‌లో సినిమాకు కథ కుదిరిందన్న మాట! మొన్న శుక్రవారమే విడుదలైన రామ్‌ ‘ఉన్నది ఒకటే జిందగీ’ మంచి టాక్‌ తెచ్చుకుంది. ఈ సంతోషంలో కొత్త సినిమాను త్వరలో ప్రారంభించాలనుకుంటున్నారట!!

మరిన్ని వార్తలు