బుల్లితెరకు రానా?

1 Jun, 2017 23:51 IST|Sakshi
బుల్లితెరకు రానా?

తెర చిన్నదే అయినా ప్రేక్షకుల్లో టీవీకి బోలెడంత ఫాలోయింగ్‌ ఉంది. ఇంట్లో ఉన్న అందర్నీ తనవైపు లాగేసుకుంటుంది. సిల్కర్‌ స్క్రీన్‌తో పోల్చితే స్మాల్‌ స్క్రీన్‌కే ప్రేక్షకులు ఎక్కువ. పైగా సినిమా స్టార్లు కూడా షోలు చేస్తుండటంతో రోజు రోజుకీ క్రేజ్‌ పెరిగిపోతోంది.

ఇప్పటికే మన టాలీవుడ్‌ స్టార్లు చాలామంది చాలా షోల్లో కనిపించారు. చిన్న ఎన్టీఆర్‌ హోస్ట్‌గా త్వరలో ‘బిగ్‌ బాస్‌’ ప్రసారం కానుంది. ఇప్పుడు చిన్ని తెరపై పెద్ద తెర స్టార్ల జాబితాలో రానా పేరు వినిపిస్తోంది. ఇటీవల రానా ఓ టీవీ షోకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారని సమాచారం. రెండు నెలల తర్వాత ఓ తెలుగు ఛానెల్‌ ప్రైమ్‌ టైమ్‌లో ఈ షో ప్రసారం కానుందని భోగట్టా. రానాతో కొన్ని ఎపిసోడ్స్‌ను షూట్‌ చేసిన తర్వాత అధికారికంగా ఈ షో గురించి నిర్వాహకులు బయటపెట్టాలనుకుంటున్నారట.