ప్రేమతో రంగ్‌ దే

10 Oct, 2019 02:27 IST|Sakshi
కీర్తీ సురేశ్, నితిన్, త్రివిక్రమ్‌

నితిన్‌ హీరోగా, ‘మహానటి’ ఫేమ్‌ కీర్తీ సురేశ్‌ హీరోయిన్‌గా తెరకెక్కుతోన్న చిత్రం ‘రంగ్‌ దే’. ‘తొలిప్రేమ, మజ్ను’ ఫేమ్‌ వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్నారు. పి.డి.వి.ప్రసాద్‌ సమర్పణలో సితార ఎంటర్‌ టైన్‌మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ సినిమా దసరా రోజున హైదరాబాద్‌లో ప్రారంభమైంది. హీరో, హీరోయిన్లపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి పారిశ్రామికవేత్త పరుచూరి మహేంద్ర కెమెరా స్విచ్చాన్‌ చేయగా, దర్శకుడు త్రివిక్రమ్‌ క్లాప్‌ ఇచ్చారు. ‘రంగ్‌ దే’ స్క్రిప్ట్‌ను నిర్మాతలు ‘దిల్‌’ రాజు, ఎస్‌.రాధాకృష్ణ (చినబాబు) చిత్ర దర్శకుడు వెంకీ అట్లూరికి అందించారు.

‘‘ప్రేమతో కూడిన కుటుంబ కథా చిత్రమిది. సుప్రసిద్ధ కెమెరామేన్‌ పి.సి.శ్రీరామ్‌గారు మా సినిమాకి ఛాయాగ్రహణం అందిస్తుండటం ఎంతో సంతోషంగా ఉంది. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం మా సినిమాకి ప్రత్యేక ఆకర్షణ’’ అని వెంకీ అట్లూరి అన్నారు. ‘‘మా సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ మంగళవారం నుంచే మొదలుపెట్టాం.  2020 వేసవికి ఈ చిత్రం విడుదలవుతుంది’’ అన్నారు సూర్యదేవర నాగవంశీ. నిర్మాతలు కిరణ్, సుధాకర్‌ రెడ్డి, హర్షిత్‌ తదితరులు పాల్గొన్నారు. నరేష్, రోహిణి, కౌసల్య, బ్రహ్మాజీ, ‘వెన్నెల’ కిషోర్, ‘సత్యం’ రాజేష్, అభినవ్‌ గోమటం, సుహాస్‌ నటిస్తున్న ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌:  ఎస్‌.వెంకటరత్నం(వెంకట్‌).
 

మరిన్ని వార్తలు