పారితోషికంపై నటి భిన్న స్పందన

12 Mar, 2018 11:51 IST|Sakshi

ముంబై : సినీ ఇండస్ట్రీలో హీరోల కన్నా హీరోయిన్‌ల పారితోషికం తక్కువన్న విషయం తెలిసిందే. ఇందుకు బాలీవుడ్‌ మినహాయింపేమీ కాదు. సోనమ్‌ కపూర్‌ నుంచి ప్రియాంక చోప్రా వరకూ ఈ విషయంలో తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు కూడా. అయితే ఇప్పుడిప్పుడే ఈ పరిస్థితులో మార్పు వస్తోంది. అందుకు నిదర్శనం 'పద్మావత్' సినిమానే. ఈ సినిమాలో రాణి పద్మావతిగా నటించిన దీపికా ప‌దుకొనే తీసుకున్న పారితోషికం రణవీర్‌ సింగ్‌, షాహీద్‌ కపూర్‌ కన్నా అధికం.

ఆ సంగతలా ఉంచితే హీరోయిన్‌ల తక్కువ పారితోషికం విషయంపై... రాణి ముఖర్జిని అడిగితే ఆమె భిన్నంగా స్పందించారు. తనకు డబ్బు ముఖ్యం కాదని, పనికే​ ప్రాధన్యత ఇస్తానని తెలిపారు. తానెప్పుడు పనిచేయడం గురించే ఆలోచిస్తానని, ఆర్థిక వ్యవహారాలన్ని తన తల్లిదండ్రులే చూసుకుంటారని తెలిపారు. 'ఈ మధ్యకాలంలో నటించడం రానివాళ్లు కూడా పారితోషికం గురించి మాట్లాడుతున్నారు. మనం చేసే పనికి సంబంధించి మెళకువలు నేర్చుకుంటే డబ్బు దానంతట అదే వస్తుంది' అన్నారు. నటులు ప్రకటనలు, రిబ్బన్‌ కటింగ్‌ల ద్వారా కూడా డబ్బు సంపాదిస్తున్నారని చెప్పారు. ప్రస్తుతం రాణిముఖర్జి 'హిచ్కి' చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో ఆమె 'టౌరెట్‌ సిండ్రోమ్' తో బాధపడే ఉపాధ్యాయురాలుగా నటిస్తున్నారు. ఈ చిత్రం మార్చి 23న విడుదల కానుంది.


 

మరిన్ని వార్తలు