షూటింగ్‌లో రణ్‌వీర్ సింగ్ గాయం

28 Feb, 2015 23:10 IST|Sakshi
షూటింగ్‌లో రణ్‌వీర్ సింగ్ గాయం

 ప్రముఖ హిందీ సినీ నటుడు, యువ సంచలనం రణ్‌వీర్ సింగ్ గాయం పాలయ్యారు. ప్రసిద్ధ దర్శకుడు సంజయ్ లీలా బన్సాలీ రూపొందిస్తున్న చారిత్రక కథా చిత్రం ‘బాజీరావు మస్తానీ’ షూటింగ్‌లో యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తుండగా ప్రమాదం జరిగింది. జైపూర్‌లో సినిమా చిత్రీకరణ జరుగుతుండగా గుర్రం మీద నుంచి రణ్‌వీర్ సింగ్ కిందపడ్డారు. ఆయనను వెంటనే ఆసుపత్రికి తరలించారు. అదృష్టవశాత్తూ, ఆయనకు ఎముకలు విరగడం లాంటివేమీ జరగలేదు. షూటింగ్‌లలో గాయపడడం రణ్‌వీర్‌కు కొత్త ఏమీ కాదు. గతంలో కూడా ‘లూటేరా’ షూటింగ్ సమయంలో రణ్‌వీర్‌కు వీపు భాగంలో తీవ్రమైన గాయమైంది. అలాగే, ‘గుండే’ షూటింగ్‌లో ఆయన చేతికీ, చెంపకూ గాయాలయ్యాయి. తాజా ప్రమాదం గురించి వ్యాఖ్యానిస్తూ, ‘‘బడీ బడీ ఫిల్మోం మే ఐసీ ఛోటీ ఛోటీ బాతేం హోతీ రహతీ హై’’ (పెద్ద పెద్ద సినిమాల్లో ఇలాంటి చిన్న చిన్నవి జరుగుతుంటాయి) అని రణ్‌వీర్ హిందీ హీరోల విలక్షణ శైలిలో వ్యాఖ్యానించారు.
 

>