ఆ విషయాలు పంచుకోవడంలో పురుషులకు సిగ్గు.. : టాప్‌ హీరో

2 Dec, 2023 10:37 IST|Sakshi

మారుతున్న జీవనశైలి కారణంగా లైంగిక ఆరోగ్యం, సంరక్షణ పెద్ద సవాలుగా మారింది. అందుకోసం కొన్ని కంపెనీలు పుట్టుకొస్తున్నాయి. రానున్నరోజుల్లో ఆ సంస్థలకు ఆదరణ పెరుగుతుందని భావించి ప్రముఖులు సైతం అందులో పెట్టుబడి పెడుతున్నారు. తాజాగా ‘బోల్డకేర్‌’ అనే సంస్థకు బాలీవుడ్ నటుడు రణ్‌వీర్ సింగ్ సహ యజమానిగా చేరారు.

సమాజంలో లైంగిక ఆరోగ్యానికి సంబంధించి ప్రజల్లో చాలా అవగాహన పెంపొందించాల్సి ఉందని, అందులో భాగంగా ఈ కంపెనీ ఎంతో కృషి చేస్తుందని రణ్‌వీర్ సింగ్ అన్నారు. ‘ఈ కంపెనీ లైంగిక ఆరోగ్య సమస్యలకు సైన్స్ ఆధారిత పరిష్కారాలను అందిస్తోంది. బోల్డ్ కేర్ సహ యజమానిగా బోర్డులోకి రావడం సంతోషంగా ఉంది. లైంగిక ఆరోగ్యం, సమస్యలు, వాటికి పరిష్కారాలు అందించడం ద్వారా ప్రజల్లో మార్పు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాం. ముఖ్యంగా పురుషులు లైంగిక సమస్యలు, సంరక్షణ అంశాలను పంచుకోవడానికి సిగ్గుపడతారు. ఈ కంపెనీ అలాంటి వారికి ఎంతో మేలు చేస్తోంది’ అని ఆయన తెలిపారు.

‘లైంగిక సమస్యలు ఉన్న వ్యక్తులు మానసికంగా చాలా బాధను అనుభవిస్తారు. వారికి ఓదార్పుతోపాటు సమస్య పరిష్కారమయ్యేలా చూడాలి. సమాజంలో ఇలాంటి వారిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఆ ఆలోచన వల్లే నా కెరీర్ ప్రారంభంలో కండోమ్ బ్రాండ్‌ను ప్రమోట్‌ చేశాను. సమస్యతో బాధపడుతున్న ప్రతిఒక్కరిలో అవగాహన తీసుకురావాల్సిన బాధ్యత అందరిపై ఉంది’ అని రణ్‌వీర్‌ సింగ్‌ వివరించారు.

ఇదీ చదవండి: సత్యం రామలింగరాజుతోపాటు ఆ నలుగురికి రూ.624 కోట్లు లాభం..

2021లో ప్రారంభమైన బోల్డ్ కేర్ కంపెనీ ఈ ఏడాదికిగాను రూ.40 కోట్ల ఆదాయాన్ని సంపాదించింది. సంస్థ ప్రారంభించిన 10 నెలల్లోనే 3 లక్షల యూనిట్లకు పైగా కండోమ్‌లను విక్రయించింది. కంపెనీ 15 లక్షలకు పైగా ఆర్డర్‌లను ప్రాసెస్ చేసింది.

మరిన్ని వార్తలు