అవకాశాల కోసం ఈ హీరోయిన్‌ ఏం చేసిందంటే..

23 Jun, 2019 07:48 IST|Sakshi

చెన్నై : ఈ తరం హీరోయిన్లు ఎక్కువగా గ్లామర్‌నే నమ్ముకుంటున్నారని చెప్పక తప్పదు. అలాంటి పాత్రలతోనే స్టార్‌డమ్‌ సాధ్యమని వారు గట్టిగా నమ్ముతున్నారు. నటి కీర్తీసురేశ్‌లా ఆదిలోనే నటనకు అవకాశం ఉన్న పాత్రలు అందరికీ అందడం సాధ్యం కాదు. దానికీ టైమ్‌ అంటూ ఒకటుంటుంది. అది వచ్చే వరకూ నటిగా సినిమాల్లో నిలదొక్కుకోవాల్సి ఉంటుంది. అందుకే గ్లామర్‌ను ఆశ్రయించక తప్పదు. నటి రాశీఖన్నా ఇందుకు అతీతం కాదు. నిజానికి తెలుగులో ‘ఊహలు గుసగుసలాడె’చిత్రంలో ఈ బ్యూటీ చక్కని నటనను ప్రదర్శించి పేరుతెచ్చుకుంది. ఆ తరువాతనే రాశీఖన్నా తన రూటు మార్చుకుంది. అలా గ్లామర్‌గా నటించిన చిత్రాలేవీ ఆమె కేరీర్‌కు ఉపయోగపడలేదన్నది వాస్తవం. ఆ మధ్య వరుసగా యువ హీరోలతో నటించేసిన ఈ జాణకు ఇప్పుడు తెలుగులో అవకాశాలు పూర్తిగా తగ్గిపోయాయి.

ప్రస్తుతం కోలీవుడ్‌నే ఆశలను ఊరిస్తోంది. ఇమైకా నొడిగళ్‌ చిత్రంతో తమిళసినిమాకు పరిచయం అయిన రాశీఖన్నాకు అంది మంచి రాశినే అనిపించింది. తరువాత జయంరవితో జతకట్టిన ‘అడంగుమరు’చిత్రం సక్సెస్‌ను అందించింది. దీంతో కోలీవుడ్‌లోనే రాశీఖన్నాకు ఆశాజనకంగా ఉంది. ఇప్పుడు విజయ్‌సేతుపతితో సంఘతమిళన్, సిద్ధార్థ్‌కు జంటగా సైతాన్‌ కా బచ్చా చిత్రాలతో పాటు మణికంఠన్‌ దర్శకత్వంలో కడైసీ వివసాయి అనే చిత్రంలోనూ నటిస్తోంది. ఇలా టాలీవుడ్‌లో నటిగా పేరు తెచ్చుకుని కోలీవుడ్‌లో మకాం పెడుతున్న నటీమణుల లిస్టులో రాశీఖన్నా చేరిపోయింది. దీంతో స్టార్‌ హీరోలతో నటించాలని ఆశ పడుతున్న ఈ బ్యూటీ అలాంటి అవకాశాల కోసం ఎదురు చూస్తోంది. అందుకు అందాలతో ఆకర్షించే పనులు చేపట్టింది. మంచి గ్లామరస్‌ ఫొటోలను అందం చూడవయా ఆనందించవయా అన్నట్టు తన ఇన్‌స్ట్రాగామ్‌లో పోస్ట్‌ చేసింది. అవి ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. కొత్త అవకాశాలకు అలాంటి గ్లామర్‌ ట్రిక్స్‌ ఎలా పని చేస్తాయో చూడాలి మరి.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

కరెంట్‌ బిల్లుపై రాయ్‌లక్ష్మీ గగ్గోలు!

 ఆ హీరోయిన్‌కు సైబర్‌ షాక్‌

డ‌బ్బింగ్ కార్యక్రమాల్లో ‘మ‌న్మథుడు 2’

‘శ్రీదేవి’ వివాదంపై స్పందించిన ప్రియా ప్రకాష్

‘సీఎం జగన్‌ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా’

పది రోజుల షూట్‌.. కోటిన్నర ‘పే’!

కంగనా రనౌత్‌కు ‘మెంటలా’!

‘నువ్వు ఎల్లప్పుడూ నవ్వుతూ ఉండాలి క్యాటీ’

షారుక్‌కు మరో అరుదైన గౌరవం

టాక్‌ బాగున్నా.. కలెక్షన్లు వీక్‌!

‘ఇది వారి పిచ్చి ప్రేమకు నిదర్శనం’

బాలీవుడ్‌కు ‘నిను వీడని నీడను నేనే’

8 నిమిషాల సీన్‌కు 70 కోట్లు!

హమ్మయ్య.. షూటింగ్ పూర్తయ్యింది!

వార్నింగ్‌ ఇచ్చిన ‘ఇస్మార్ట్‌ శంకర్‌’

రష్మికా మజాకా

లారెన్స్‌ కోసం వచ్చి భిక్షాటన

రత్నకుమారి వచ్చేశారు

వసూళ్లు పెరిగాయి

వసూళ్లు పెరిగాయి

యుద్ధానికి సిద్ధం

క్రీడల నేపథ్యంలో...

ది బాస్‌

రచయితగా ఎప్పుడూ ఓడిపోలేదు

పండగ మళ్లీ మొదలు

ఏం వెతుకుతున్నారు?

అదే నా ప్లస్‌ పాయింట్‌

‘అవును.. మేము పెళ్లి చేసుకున్నాం’

విలక్షణ నటుడి సరికొత్త అవతారం!

ఉత్కంఠ భరితంగా ‘వార్‌’ టీజర్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

 ఆ హీరోయిన్‌కు సైబర్‌ షాక్‌

మూడు నెలల అనంతరం రిజెక్ట్‌ చేశారు..

కంగనా రనౌత్‌కు ‘మెంటలా’!

డ‌బ్బింగ్ కార్యక్రమాల్లో ‘మ‌న్మథుడు 2’

‘సీఎం జగన్‌ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా’

‘నువ్వు ఎల్లప్పుడూ నవ్వుతూ ఉండాలి క్యాటీ’