దుమ్ములేపిన బాలయ్య.. రూలర్‌ ట్రైలర్‌ రిలీజ్‌

8 Dec, 2019 09:07 IST|Sakshi

నందమూరి బాలకృష్ణ సినిమాలు అంటేనే మాస్‌ డైలాగులు, దుమ్ములేచిపోయే ఫైట్‌ సీన్స్‌కి కేరాఫ్‌ అడ్రస్‌. తన అభిమానులు కూడా ఆయన నుంచి అదే కోరుకుంటారు. సింహా, లెజెండ్‌ వంటి మాస్‌ సినిమాలతో ఓ ట్రెండ్‌ సృష్టించిన బాలయ్య.. మరోసారి అదే ఊపుతో ప్రేక్షకుల ముందు రాబోతున్నాడు. ఆయన కథానాయకుడిగా కేఎస్‌ రవికుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రూలర్‌’ ట్రైలర్‌ వచ్చేసింది. సోనాల్‌ చౌహాన్‌, వేదిక కథానాయికలుగా నటిస్తున్న ఈ సినిమా ట్రైలర్‌ను ఆదివారం చిత్ర బృందం విడుదల చేసింది. ఇప్పటివరకూ ‘రూలర్‌’ చిత్రానికి సంబంధించి విడుదల చేసిన బాలకృష్ణ స్టైలిష్‌, మాస్‌లుక్‌లు, టీజర్‌ సినిమాపై అంచనాలను పెంచగా, తాజా ట్రైలర్‌ మరింత ఆసక్తికరంగా సాగింది.

దుమ్ములేపే ఫైట్లు, తూటాల్లాంటి డైలాగులతో ట్రైలర్‌లోనే బాలయ్య రెచ్చిపోయాడు. ‘ఇది దెబ్బతిన్న సింహాంరా.. అంత తొందరగా చావదు. వెంటాడి వేటాడి చంపుద్ది’ అంటూ బాలయ్య పలికే   డైలాగు అదిరిపోయింది. సినిమాలో ఆయన చెప్పే డైలాగ్‌ ఫ్యాన్స్‌ను మరింత విపరీతంగా ఆకట్టుకుంటాయని చిత్ర బృందం ధీమా వ్యక్తం చేస్తోంది. ఎన్టీఆర్‌ బయోపిక్‌ తీవ్ర నిరాశను మిగల్చడంతో.. రూలర్‌పై బాలకృష్ణ ప్రత్యేక దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. సినిమాలో ఆయన గెటప్‌, డ్రస్, డైలాగ్స్‌ను చూస్తే ఇది అర్థమవుతుంది. డిసెంబర్‌ 20న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

మీ అభిప్రాయాలను కింద తెలపండి

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments

మరిన్ని వార్తలు