మరో వికెట్‌ పడింది.. భయం వేస్తోంది : సాయి తేజ్‌

14 May, 2020 16:46 IST|Sakshi

 హీరో నిఖిల్‌ను ఉద్దేశిస్తూ సాయితేజ్ ట్వీట్ 

సాక్షి, హైదరాబాద్‌: టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ వివాహం గురువారం ఉదయం తను ప్రేమించిన యువతి డా.పల్లవి వర్మతో జరిగిన సంగతి తెలిసిందే. లాక్‌డౌన్ కారణంగా  అతికొద్ది మంది సమక్షంలోనే ఈ వివాహం జరిగింది. దీంతో సోషల్ మీడియా వేదికగా నిఖిల్‌, పల్లవిల జోడీని ఆశీర్వదిస్తూ పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు టాలీవుడ్ సెలబ్రిటీలు. ఈ క్రమంలో నిఖిల్‌ పెళ్లిపై మెగా హీరో సాయి ధరమ్ తేజ్‌ ఫన్నీ ట్వీట్‌ చేశారు. నిఖిల్‌కు విషెష్‌ చెబుతూ..`టీ టౌన్‌లో మరో వికెట్ పడింది. జీవితంలో అతి పెద్ద అడుగు వేసిన నిఖిల్‌కు శుభాకాంక్షలు. మీకు భవిష్యత్తులో అన్నీ హ్యాపీ‌డేసే ఉండాలని కోరుకుంటున్నా`అంటూ సాయితేజ్ ట్వీట్ చేశాడు. 
(చదవండి: ఇంటివాడైన హీరో నిఖిల్‌‌)

సాయితేజ్ ట్వీట్‌కు నటుడు బ్రహ్మాజీ రిప్లై ఇచ్చాడు. `వికెట్స్ పడిపోతుంటే ఎంజాయ్ చేస్తున్నావా తేజూ` అంటూ ట్వీట్ చేశాడు. దీనికి తేజ్‌ స్పందిస్తూ ‘ భయం వేస్తుంది భాజీ’. అని ట్వీట్‌ చేశాడు. ఇక మెగా అల్లుడు పెట్టిన ట్వీట్‌పై నెటిజన్లు తమదైన శైలీలో స్పందిస్తున్నారు.  'వావ్! వెరీ ఇంట్రెస్టింగ్.. మరి మీ వికెట్ ఎప్పుడో!' అంటూ నిఖిల్ జోడీకి శుభాకాంక్షలు చెబుతున్నారు.
(చదవండి: పెళ్లి చేసుకున్న జబర్దస్త్‌ మహేశ్‌)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా