ఆన్ లైన్ లో కూడా సల్మాన్ సూపర్ స్టార్!

1 Aug, 2013 20:15 IST|Sakshi
ఆన్ లైన్ లో కూడా సల్మాన్ సూపర్ స్టార్!
బాడీగార్డ్, ఏక్ థా టైగర్, దబాంగ్-2 చిత్ర విజయాలతో ఊపు మీద ఉన్న బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ మరో ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. మోబైల్ ఫోన్ ద్వారా ఇంటర్నెట్ లో  అత్యధికంగా వెతికిన భారతీయ సెలబ్రిటీగా సల్మాన్ ఖాన్ సూపర్ స్టార్ గా నిలిచాడు.
 
ఇటీవల జరిపిన సర్వేలో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్, మాజీ ప్రేయసి కత్రినా కైఫ్ లను వెనక్కి నెట్టి టాప్ సెలబ్రిటిగా నిలిచాడు. ఇంకా టాప్ జాబితాలో బర్ఫీ హీరో రణబీర్ కపూర్, బాలీవుడ్ తార అనుష్క శర్మ, దక్షిణాది తారలు ప్రియమణి, కాజల్ అగర్వాల్, నిత్యామీనన్ లు చోటు దక్కించుకున్నారు.