నాలో మరో కోణాన్ని చూడాలంటే..

29 Jun, 2019 09:46 IST|Sakshi

తమిళసినిమా: సాధారణంగా హీరోల కంటే హీరోయిన్లకు పారితోషికాల్లో తేడా ఉండవచ్చు గానీ, ప్రేక్షకుల్లో మాత్రం క్రేజ్‌, ఫాలోయింగ్‌లో వారికేం తీసిపోరు. దాన్ని వాడుకోవడానికి ఎవరి పంథాను వారు ప్రయత్నాలు చేసుకుంటారు. నటి సమంత తన పాపులారిటీని వాడుకునే ప్రయత్నాలు మొదలెట్టింది. ఈ అమ్మడికి ఇటీవల నటించిన తెలుగు చిత్రం మజిలి, తమిళ చిత్ర సూపర్‌డీలక్స్‌ వంటి సక్సెస్‌లు ఉన్నా, అవకాశాలు తగ్గుముఖం పడుతున్నాయనే టాక్‌ మొదలైంది. తనకు అవకాశాలు తగ్గిన మాట నిజమేనని సమంతనే స్వయంగా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో అంగీకరించింది. దీంతో అవకాశాలను పెంచుకునే ప్రయత్నాలు చేస్తోంది. తరచూ గ్లామర్‌ ఫొటోలను దిగి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేస్తూ ఫ్రీ ప్రచారాన్ని పొందాలనుకుంటోంది. పెళ్లి అయినా ఇలాంటి అవతారాలేంటి అనే కామెంట్స్‌ వస్తున్నా, ఆమె అభిమానులు మాత్రం ఆ గ్లామరస్‌ ఫొటోలను బాగానే ఎంజాయ్‌ చేస్తున్నారు.

కాగా ప్రస్తుతం తన తాజా చిత్ర ప్రమోషన్‌కు రెడీ అయ్యింది. ఈ బ్యూటీ నటించిన ఓ బేబీ చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధం అవుతోంది. సమంత సెంట్రిక్‌ కథా పాత్రలో నటించిన చిత్రం ఇది. ఇంతకు ముందు ఈమె నటించిన హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ కథా చిత్రం యూటర్న్‌ ఆశించిన విజయాన్ని సాధించలేదు. దీంతో ఓ బేబీ చిత్రాన్ని ఎలాగైనా సక్సెస్‌ బాట పట్టించాలని నిర్ణయించుకున్నట్లుంది. అందులో భాగంగా తన అభిమానులను ఆకర్షించే విధంగా ట్విట్టర్‌లో ప్రచారం మొదలెట్టేసింది. తాజాగా చేసిన ట్వీట్‌లో ఓ బేబీని డాక్యుమెంట్రీ చిత్రం అనుకోవద్దు. ఇది మంచి కమర్శియల్‌ కథా చిత్రం అని పేర్కొంటూ ప్రమోషన్‌ చేసుకుంటోంది. అంతే కాదు తన కెరీర్‌లోనే ఛాలెంజింగ్‌ చిత్రం ఓబేబీ అని చెప్పింది. ఈ చిత్రం కోసం చాలా శ్రమించానని, తనలోని మరో కోణాన్ని చూడాలనుకుంటే  ఓబేబీ చిత్రాన్ని థియేటర్లకు వచ్చి చూడండి అని పిలుపునిచ్చింది. కాగా ఓ బేబీ చిత్రం జూలై 5న తెరపైకి రానుంది. మరి సమంత ట్విట్టర్‌ ప్రచార ట్రిక్స్‌ ఈ చిత్రానికి ఎంత వరకూ పనిచేస్తుందో తెలియాలంటే మరో వారం రోజులు ఆగాల్సిందే.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా